Home » ఈ శివుడిని దర్శిస్తే.. కాశీని దర్శించిన పుణ్యమట.. ఈ ఆలయం ఎక్కడుందంటే..?

ఈ శివుడిని దర్శిస్తే.. కాశీని దర్శించిన పుణ్యమట.. ఈ ఆలయం ఎక్కడుందంటే..?

by Anji
Ad

కరీంనగర్‌లో అత్యంత ప్రాచీనమైన దేవాలయం గౌరీ శంకర్ దేవాలయం. ఈ దేవాలయాన్ని 1200 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించారని ఆలయ పూజారి పురాణం మహేష్ శర్మ తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీ గా విరజిల్లుతున్నారు. ఈ ఆలయ విశిష్టతకు వస్తే తూర్పు భాగంలో సూర్యుడు, ఆగ్నేయంలో అయ్యప్పస్వామి, దక్షిణ భాగంలో వీరభద్రుడు, కాలభైరవుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే నైరుతి భాగంలో ఇక్కడ లేనటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువై ఉండడం పశ్చిమాన సరస్వతి దేవి అమ్మవార్ల విగ్రహాలు ఉండడం ఇక్కడ విశిష్టత. ఇకపోతే ఇక్కడికి వివాహం కానీ యువతి, యువకులు, చక్కెర పొడి తో కన్యక పశుపతి, వరపశుపతి, పూజలు చేస్తే వారికి తొందరలోనే వివాహం జరుగుతుందట.

Advertisement

Advertisement

ఋణగ్రస్తుల నుండి విముక్తి కలగాలంటే కుబేర పశుపతి అభిషేకం చేస్తే ఋణ గ్రస్తుల దోషం పోతుందని ఆలయ పూజారి అంటున్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలంటే శివునికి అభిషేకం చేసిన నీళ్లతో స్నానం చేస్తే ఏలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఇక్కడి భక్తుల అపార నమ్మకం. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి అత్యంత అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శివుడికి శివరాత్రి రోజున శివ కళ్యాణం అలాగే రోజు జరిగే కైకర్యాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంకా శివయ్యను కొలిచిన భక్తులకు కొంగు బంగారం అవుతారట. ప్రతి సోమవారం ఇక్కడ అత్యంత వైభవంగా అభిషేకాలు జరుగుతుండడం విశేషం.

 

కాశీకి వెళ్తే వచ్చే పుణ్యం ఇక్కడ గౌరీ శంకర్లను దర్శించుకుంటే అట్లాంటి పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి..ఇంకా ఈ శివాలయానికి పేరు పాత శివాలయం కూడా అంటారు. పాత శివాలయంగా ప్రసిద్ధిగాంచిన మహా క్షేత్రంగా విరుజిల్లుతున్న ఈ శివాలయానికి వస్తే భక్త కామధేను కల్పవృక్షము ఈశ్వరుని సేవించి తరించినట్లు అవుతుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. శివరాత్రి పర్వదినం అభిషేకం, కళ్యాణం, జాగరణ బిల్వాష్టకం ఉంటుంది.

Also Read :  భారతదేశంలో సూర్యుడు తొలుత ఏ రాష్ట్రాంలో ఉదయిస్తాడో తెలుసా..?

Visitors Are Also Reading