సాధారణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్తి ఫుడ్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏం తినాలి ఏం తినకూడదు అనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. కొంతమంది ఉదయం నిద్ర లేచిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా రాక రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. నీటి ప్రభావము మన ఆరోగ్యం పై చూపిస్తుంది. కొంతమంది ఉదయం లేచిన తర్వాత చాలాసేపటి వరకు పరిగడుపునే ఉంటారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిస్మిస్
Advertisement
తీరానికి చాలా అవసరమైంది ఆరోగ్యకరమైనది కిస్మిస్. ఇందులో ఐరన్ ప్రోటీన్ ఫైబర్ వంటివి ఉంటాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలహీనత దూరం అవుతుంది. దీంతోపాటు హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. పరగడుపున కిస్మిస్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రతిరోజు రాత్రివేళ 6 కిస్మిస్ గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున నీళ్లతో సహా తీసుకోవాలి.
Advertisement
బాదం
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పాదంలో అయితే పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో ప్రోటీన్లు ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. బరువు తగ్గించడానికి సైతం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎండు ఖర్జూరం
ఎండు ఖర్జూరాలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. ఇక అదే సమయంలో జీర్ణక్రియ కూడా చాలా మెరుగు పడుతుంది. దీంతోపాటు బరువు తగ్గడానికి సైతం ఉపయోగపడుతుంది.
Also Read : నేలపై కూర్చొని భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా ?