ఆచార్య చాణక్యుడు తన విధానాలతో మానవ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఇతరులతో ఎప్పుడూ కూడా ప్రస్తావించకూడని కొన్ని విషయాలను చెప్పాడు. ఇతరులు బలంగా మీకు బలహీనతలా పని చేస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై చాణక్యుడు ఎలాంటి సలహా ఇచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భద్రతకు సంబంధిత సమస్యలను బహర్గతం చేయకూడదు. ముఖ్యంగా ఒకరి భద్రత సంబంధిత విధానాలు, ఒకరి కార్యకలాపాలు, రహస్య సమాచారం, రహస్య ఎజండా, ఇతర సంబంధిత సమస్యలను ఇతరులకు వెల్లడించకూడదు. దీని కారణంగా వ్యక్తి భద్రత ప్రమాదంలో పడవచ్చు. ప్రత్యర్థులు మీ యొక్క బలహీనతల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్రణాళికలు, వ్యూహాల గురించి ఒక వ్యక్తి తన ప్రణాళికలు, వ్యూహాలు, ఉద్దేశించిన ఇతర పనులకు చెందిన రహస్య సమాచారాన్ని ఇతరులత పంచుకోకూడదు. ఇది అతను తీసుకుంటున్న చర్యను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీ వ్యూహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశముంది.
Advertisement
Advertisement
ఆస్తి గురించి చాణక్యుడి ప్రకారం.. ఒక్క వ్యక్తి ఆస్తి గురించి వివరాలను ఇతరులకు అస్సలు చెప్పకూడదు. ఇంటి గుట్టు ఆస్తిని సురక్షితంగా ఉంచడంలో సహయపడుతుంది. బలహీనతలను ఇతరులకు ఉపయోగించే అవకాశమివ్వకుండా సురక్షితంగా ఉండాలని చెప్పాడు చాణక్యుడు. తన విధానాల్లో ఒక వ్యక్తి తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించకూడదని నొక్కి చెప్పాడు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గోప్యత పాటించాలని ఎవ్వరితో కూడా పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుపై ఇతరుల చెడు దృష్టి పడే అవకాశముంది.
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఓ వ్యక్తి తన లక్ష్యాన్ని అందరితో కూడా చెప్పకూడదు. ఇలా చేయడం ద్వారా ఎవరైనా చెడు దృష్టికి రావచ్చు లేదా మీ ప్రత్యర్థి మీ పనిలో అవాంఛనీయమైన అడ్డంకులకు కారణం కావచ్చు. అందుకే మీ లక్ష్యాల్లో కొన్ని ఎల్లప్పుడూ ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు.. తనకే కాదు.. తాను వెళ్లిన కుటుంబానికి కూడా..!