Home » వీటిని మాత్రం ప్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి.. విషం కంటే ప్రమాదం..!

వీటిని మాత్రం ప్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి.. విషం కంటే ప్రమాదం..!

by Anji
Ad

సాధారణంగా వేసవికాలంలో ఎక్కువగా కొన్ని వస్తువులను ప్రిడ్జ్ లో పెడుతుంటాం. ఎండలకు ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టిన నీటినే తాగుతుంటారు. వేసవికాలంలో చాలా మందికి ఫ్రిడ్జ్ అవసరం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆహార పదార్థాలను, కూరగాయలను, నీళ్లు, పాలు, పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిడ్జ్ లో పెడతారు. వీటిలో కొన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వాటితో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పుచ్చకాయలు వేసవిలో చాలా వరకు చల్లగా ఉండటానికి మనం తింటాం. బయటికి వెళ్లినప్పుడు రెండు, మూడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. ముఖ్యంగా పుచ్చకాయలను కోస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కోయని పుచ్చకాయలను చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చు. 

ఉల్లిపాయలు మనం వంటకి సరిపోయే దాని కంటే ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కోయడం వల్ల వాటిని మళ్లీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం. దీంతో తగిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది. తరిగిన ఉల్లిపాయాలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండటమే బెటర్. 

బంగాళదుంపలను చల్లని ప్రదేశంలో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చక్కర శాతం చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీంతో కూరలో రుచి అనేది మారుతుంది. వీటిని వంటరూమ్ లోనే ఉంచుకోవడం చాలా బెటర్. 

Advertisement

తేనే ఎన్నిసంవత్సరాలు అయిన చెడిపోని ఆహార పదార్థం ఇది. ఫ్రిడ్జ్ లో మాత్రం దీనిని అస్సలు ఉంచకండి. దీంతో తేనె యొక్క రుచి మారుతుంది. తేనేను అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశంలో ఉంచుకోవాలి. 

అరటిపండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దీంతో అరటి పండ్లు తొందరగా చెడిపోయే అవకాశముంది. అరటిపండ్లను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. 

పువ్వులను కూడా అస్సలు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం పడుతుంది. పువ్వుల వాసనతో ఇతర ఆహారాలను మనం తినలేం. 

పచ్చళ్లు కాలానికి తగినట్టు తెలుగు వారు తయారు చేసుకుంటారు. ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పచ్చళ్లు ఉంచడం వల్ల చల్లదనానికి త్వరగా చెడిపోతాయి. 

సాధారణం మనం బ్రెడ్ ఫ్యాకెట్ ఓపెన్ చేసిన తరువాత మిగిలిపోయినది ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. దీంతో బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తాయి. అందువల్ల కవర్ మూసీ ఉంచాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 తినేముందు విస్తారాకు చుట్టూ నీళ్లు చల్లుతారు.. ఎందుకో తెలుసా ?

వేడినీటిలో అల్లం కలిపి తాగుతున్నారా..? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి !

Visitors Are Also Reading