ఆచార్య చాణిక్యుడి గురించి అందరికే తెలిసే ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎలా ఉండాలి. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి. విజయం ఎలా సాదించాలి. ఇలా మనిషి జీవితానికి సంబంధించిన పలు విషయాలను చెప్పాడు. అదేవిధంగా పక్షులతో ఎలా ఉండాలి. పక్షులు ఎలా ఉండాలి. పక్షులు ఎలా ఉంటాయి. వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను తెలియజేశారు. ప్రధానంగా కొన్ని పక్షులకు ఉన్న లక్షణాలను చూసి మనం నేర్చుకుంటే జీవితంలో మనకు తిరుగుండదని చెప్పారు. అలాంటి పక్షుల్లో ఒకటి కాకి. కాకి లక్షణాలు ఏంటి..? వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా కాకి తన నివాసం పట్ల, ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మనిషి కూడా తన జీవితం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో కష్టాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నా చాణక్య. కాకి ప్రవర్తన చాలా మొండిగా ఉంటుంది. అనగా ఏదైనా పని తలపెట్టిందంటే అది పూర్తయ్యే వరకు వదలదు. అదేవిధంగా మనిషి కూడా తన కెరీర్‌లో తనను తాను స్ట్రాంగ్‌గా చేసుకొని విజయాలను సాధించడానికి సిద్ధంగా ఉండాలని చాణక్య తెలిపారు. దేనిని కాకి అంత తొందరగా నమ్మదు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించుకున్న తరువాతనే నమ్ముతుంది. అదేవిధంగా మనిషి కూడా ఎవ్వరినీ అంత తొందరగా నమ్మవద్దు. ఇలా తొందరగా నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులకి గురవుతారు.
Advertisement
Advertisement
అదేవిధంగా కాకి ముందు జాగ్రత్తలు చాలా తీసుకుంటుంది. ఎప్పటికో ముందే తన వస్తువులను తెచ్చి తన గూటిలో పెట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో వస్తువుల, ఆహారం కాని దొరకని సమయంలో వాటిని వాడుకుంటుంది. ముందుగానే జాగ్రత్త పడుతుందన్నమాట. అలాగే మనిషి కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. కాకి ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ఆపద వస్తుందో అని ముందుగానే పసిగట్ట గలదు. తనకు కొన్ని సంఘటనలు ముందుగానే తెలిసి పోతాయట. మనిషి కూడా ఎప్పుడూ జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని గమనిస్తుండాలి. అప్రమత్తంగా ఉండడం వల్ల కొన్ని విషయాలను తెలుసుకున్న వారు అవుతారు. ఇలా కాకిలో ఉండే లక్షణాలను నేర్చుకుంటే మనిషి జీవితానికి తిరుగుండదని చాణక్య అభిప్రాయపడ్డారు.
Also Read :
Astrology : ఈ ఐదు రాశుల వారు ఎప్పుడూ అసూయతోనే ఉంటారు.. ఇతరుల సంతోషాన్ని సహించరు