Home » వేణు స్వామి అసలు బిజినెస్ జ్యోతిష్యం చెప్పడం కాదా.. అసలు బిజినెస్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

వేణు స్వామి అసలు బిజినెస్ జ్యోతిష్యం చెప్పడం కాదా.. అసలు బిజినెస్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా  పలువురు  రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు జోష్యం చెప్పారు. అయితే ఆయన చెప్పిన జోస్యం దాదాపు 90 శాతం మాత్రం కరెక్ట్ అవుతుందని చాలా మంది చెబుతుంటారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో మూడు సార్లు వాస్తవమే జరిగింది. కానీ నాలుగో సారి మాత్రం ఆయన అంచనాలు తలకిందులయ్యాయి.  దీంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ట్రోల్స్ చేస్తున్నారు.

venuswamy

Advertisement

గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారని.. పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం ఉండదని.. విడిపోతారని చెప్పారు. సమంత-నాగచైతన్య విషయంలో వేణుస్వామి చెప్పింది వాస్తవంగా జరిగింది. కేవలం సమంత విషయంలోనే కాదు.. పలువురు సినిమా సెలబ్రిటీల విషయంలో కూడా ఈయన చెప్పిన జాతకాలు నిజం కావడంతో ఈయనను అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అయింది. ఇటీవలే ఈయన చెప్పే జాతకాలు కొన్ని వాస్తవం కాకపోవడంతో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ప్రధానంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అవుతారు అంటూ వేణు స్వామి చెప్పారు. కేసీఆర్ కాలేదు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంతగా సక్సెస్ సాదించదని చెప్పారు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కాకపోవడంతో ఈయన పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

తాజాగా వేణుస్వామికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణు స్వామి మెయిన్ బిజినెస్ జాతకాలు చెప్పడం కేవలం సైడ్ బిజినెస్ అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈయన మెయిన్ బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే.. పబ్ నిర్వహిస్తున్నారు.  పబ్ నిర్వహించడం గురించి గతంలో వేణు స్వామి ఓ సందర్భంలో తెలియజేశారు. తన జాతకం ప్రకారం.. తనకు ఏ రంగం అయితే కలిసి వస్తుందోనని ఈయన తన జాతకాన్ని చూసుకొని తనకు పబ్ నిర్వహించే బిజినెస్ అయితే బాగుంటుందని.. అందుకే తాను ఈ రంగంలోకి అడుగుపెట్టానని ఈ విషయంలో తనకు ఏ విధమైనటువంటి నిర్మొహమాటం లేదని వేణు స్వామి తెలిపారు. అమ్మా..  వేణు స్వామి జ్యోతిష్కుడిగా గుర్తింపు పొంది మెయిన్ బిజినెస్ పబ్ నడపడమా..? ఇది కేవలం సైడ్ బిజినెస్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Visitors Are Also Reading