Home » త్రిష గురించి లియో నటుడు ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

త్రిష గురించి లియో నటుడు ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

by Anji
Ad

హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె వరుస సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. తాజాగా   నటి త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పై కోలీవుడ్ తారలు అందరూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement

Advertisement


మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ ఆ సినిమాలో ఒక్క బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నాను. గతంలో ఇతర నటీమణులతో చేసినట్లే.. ఆమెను బె*డ్ రూమ్ కు తీసుకెళ్తానని అనుకున్నాను. ఇంతకు ముందు సినిమాల్లో చాలా రే**ప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు.. కానీ కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్ పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి, శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading