గ్లోబల్ స్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించి ఇండస్ట్రీలోనే చూడ్డానికి ఎంతో సింపుల్ గా డ్రెస్సింగ్ తో ఆకట్టుకునే రామ్ చరణ్ తాను వాడే లగ్జరీ వస్తువుల్లో మాత్రం తన రేంజ్ చూపిస్తాడు. కార్ల దగ్గరి నుండి వేసుకునే చెప్పుల దాకా సింపుల్ గానే కనిపించినా వాటి రేంజ్ ఓ స్థాయిలో ఉంటుంది. ఇక రామ్ చరణ్ కి వాచ్ ల పిచ్చి కూడా చాలా ఉంటుందని తెలిసిందే.
గత రెండు నెలల కిందట క్లిమ్ కారా నామకరణం రోజు రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన ఒక కాస్ట్లీ వాచ్ ని పెట్టుకుని సందడి చేయగా.. ఆ వాచ్ 1కోటి 62 లక్షలు అని తెలిసింది. తాజాగా వరుణ్ లావణ్య పెళ్లిలో పెట్టుకున్న వాచ్ అంతకంటే చాలా కాస్ట్లీ గా ఉంది. అయితే మన ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా. హీరో వేసుకున్న షర్ట్ ఖరీదే నిమిషాల్లో కనిపెట్టి చెప్పేస్తారు. వాచ్ గురించి కూడా కనుక్కున్నారు.
Advertisement
Advertisement
అలాంటిది తమకి ఇష్టమైన హీరోల లగ్జరీ వస్తువుల గురించి కనుక్కోలేరా? లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. గోల్డ్ పోతా వేసిన ఆ వాచ్ మోడల్ పేరు patek philippe 5990/1R nautilus వాచ్ అని తెలిసింది.ఒక దాని ఖరీదు 2,85,000 డాలర్లు. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు 2 కోట్ల 37 లక్షల రూపాయలు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో రామ్ చరణ్ దగ్గర ఉన్నంత కాస్ట్లీ వాచెస్ మరే హీరో దగ్గర లేవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి ! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!