నందమూరి హీరోలు అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఈ హీరోల తర్వాతే మిగతా హీరోలు ఇండస్ట్రీలో కాస్త నిలదొక్కుకున్నారు. అలాంటి నందమూరి ఫ్యామిలీలో ఈతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ గోబల్ స్టార్ గా మారారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇంతటి పొజిషన్ కి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు.
Advertisement
ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ ఆయనను మొదట్లో ఆదరించలేదు. అయినా నారాజు చెందకుండా తాను అనుకున్నది సాధించడం కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అయ్యారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అయితే ఈ చిత్రానికి ఎన్టీఆర్ దాదాపుగా రూ:70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఇంకా ఎన్టీఆర్ సినిమా విషయాలు పక్కన పెడితే.. ఆయన ఎప్పుడూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు.. ఎన్టీఆర్ కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.
Advertisement
ఇప్పటికే గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఎన్టీఆర్ కు వాచ్ లు ధరించడం అంటే చాలా ఇష్టమట. తాజాగా ఆయన ఒక వాచ్ ధరించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ వాచ్ ద్వారా కోట్ల రూపాయల్లో ఉన్నదట. అయితే మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యువ హీరో సంగీత్ శోభన్ ఎన్టీఆర్ ను కలిశారు. వీరిద్దరూ కలిసినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందులో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై అందరి కన్ను పడింది. ఈ ఖరీదైన వాచ్ ఎంబి అండ్ ఎఫ్ కంపెనీకి చెందినదట. అయితే అది చూసిన నేటిజన్స్ దీని ధర వెతకడం ప్రారంభించారు. దీని ధర ఏకంగా 1.66 కోట్లు ఉందని తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్.. డీఎస్సీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
టైగర్ నాగేశ్వర రావు’ మూవీలో రేణుదేశాయి ఏ పాత్రలో నటిస్తుందో మీకు తెలుసా ?