Home » ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థపు ఉంగరం ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థపు ఉంగరం ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అటు కన్నడ చిత్రాలతో పాటు ఇటు.. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన ఈయన కూతురినీ ఇటీవలే ఓ ఇంటి కోడలు చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య నిశ్చితార్థం కూడా ఓ గుడిలో జరిగింది. ప్రముఖ నటుడు తండి రామయ్య కుమారుడు నటుడు ఉమాపతితో ఈమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. 

Advertisement

వాస్తవానికి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. ఈ కారణంగానే పెద్దలను ఒప్పించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని కెమెరాలో కవర్ చేసిన కెమెరామేన్ అద్విక్ సుదర్శనన్ నిశ్చితార్థం గురించిన వివరాలను వెల్లడించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అర్జున్ తన కూతురి నిశ్చితార్థం రోజున ఓ తండ్రిగా చాలా సంతోషంగా ఉన్నారు. నిశ్చితార్థానికి చక్కగా సిద్ధం చేసేందుకు బెంగళూరు నుంచి ఈవెంట్ మేనేజ్ మెంట్ బృందాన్ని పిలిచినట్టు అద్విక్ వెల్లడించారు. ఐశ్వర్య చెప్పినట్టుగానే తన డ్రెస్సింగ్ కలర్ విషయం మొదలు కేకు, డెకరేషన్ అన్నింటిలో కూడా చాలా సింపుల్ గా ఉండేవిధంగా డెకరేట్ చేసినట్టు సమాచారం. 

Advertisement

మరోవైపు తాజాగా ఈ నిశ్చితార్థ వేడుకల్లో ఉమాపతి, ఐశ్వర్య అర్జున్ ధరించిన ఉంగరం గురించి కూడా అద్విక్ వెల్లడించారు. 5 క్యారెట్ బ్లడ్ రూబీ రింగ్ వీరు ధరించినట్టు వెల్లడించారు. అంతేకాదు.. ఈ ఉంగరాన్ని నేరుగా బర్మా నుంచి తెప్పించారట. చాలా అరుదైన కలయిక ఈ ఉంగరం అని అద్విక్ వెల్లడించారు. అంతేకాదు.. దీని ధర అక్షరాల రూ.20లక్షలకు పైమాటనే. ఇకపోతే ఈ ఉంగరం ధర తెలిసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మిడిల్ క్లాస్ ప్యామిలీ సులభంగా బ్రతికేయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వీరికి నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగబోతుందని అర్జున్ సర్జా కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading