Home » హీరోయిన్ అనుష్కకి ఉన్న వ్యాధి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హీరోయిన్ అనుష్కకి ఉన్న వ్యాధి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తోన్న సినీ తారలు వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్లు అయినటువంటి సమంత, మమత మోహన్ దాస్, శృతిహాసన్ తమకు ఉన్నటువంటి సమస్యల గురించి బయట పెట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా మరో సీనియర్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఆమె మరెవ్వరో కాదండోయ్.. అభిమానుల మదిలో స్వీటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార అనుష్క శెట్టి. 

Advertisement

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క తాను ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే.. ఏకధాటిగా దాదాపు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు నవ్వూతూనే ఉంటానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అనుష్క. నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. అసలు నువ్వుని కంట్రోల్ చేసుకోలేను. ఇక షూటింగ్ సెట్ లో నేను నవ్వడం స్టార్ చేస్తే.. ఇక షూటింగ్ ఫ్యాకప్ చేసుకోవాల్సిందే. ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే.. సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటాను. 

Advertisement

Also Read :   ప్రేమికుల రోజు సందర్భంగా రష్మిక ఏం పోస్ట్ చేసిందో తెలుసా ?

Manam News

ఈ గ్యాప్ లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకొని వస్తారు అని తనకు ఉన్న ఈ వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. అనుష్క ఇది సీరియస్ గా చెప్పుకొచ్చిందా… లేక సరదాగా చెప్పుకొచ్చిందా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. నవ్వడం ఆరోగ్యానికి మంచిదేగా స్వీటి. నువ్వు ఎంత సేపు నవ్వినా మాకు ఆనందమే అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది అనుష్క. మైత్రీ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.  

Also Read :  ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి ప్రపోజ్ చేసిన అదితిరావు హైదరీ.. ప్రియుడి రియాక్షన్ ఏంటంటే..? 

Visitors Are Also Reading