Home » శీతాకాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

శీతాకాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

by Anji
Ad

సాధారణంగా శీతాకాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. ఔషద గుణాలు, పోషకాలు కలిగిన వీటిని రెగ్యులర్ గా తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రధానంగా ఈ సీజన్ లో పచ్చి బఠానీలు మార్కెట్ లో పుష్కలంగా లభిస్తాయి. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతాయి. పచ్చి బఠానీల్లో ప్రొటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం వంటివి ఉంటాయి. వీటిని కూరగా చేసుకొని చపాతీల్లో, అన్నంలో కూడా తినవచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ మటర్ తినాలని సూచిస్తున్నారు.  పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

Advertisement

పచ్చి బఠానీలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా వినియోగించడం ద్వారా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. పచ్చి బఠానీల్లో సెలీనియం మూలకం ఉంటుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. 

Advertisement

Also Read :   ఒకప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు అద్దె ఇంట్లో.. కాంతారావు కొడుకు భావోద్వేగం..!

ముఖ్యంగా పచ్చి బఠానీలను రోజూ ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే యాంటి యాక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉదరానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్.. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను రోజూ తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు. 

Also Read :  ‘మా సినిమాలను అడ్డుకుంటే.. తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటాం’

Visitors Are Also Reading