Home » బ్లాక్ టీ యొక్క‌ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

బ్లాక్ టీ యొక్క‌ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

by Anji
Ad

గ్రీన్ టీ గురించి తెలియని వారు అంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. గ్రీన్ టీలో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు, ఫైబ‌ర్‌, కెఫిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. ప్ర‌ధానంగా మ‌ధుమేహం, ఊబ‌కాయం, అధిక ర‌క్త‌పోటు వారికి ఇది చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. మీరు రోజుకు రెండు సార్లు గ్రీన్ టీని తీసుకోవ‌చ్చు. గ్రీన్ టీ కాకుండా బ్లాక్ టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంపై మంచి ప్ర‌భావం ఉంటుంది. మారుతున్న వాతావ‌ర‌ణం వ‌ల్ల క‌లిగే స‌మ‌స్యల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఇక ఈ సీజ‌న్‌లో అసాధార‌ణ ఉష్ణోగ్ర‌త వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వ‌చ్చే ప్రమాదం ఉంటుంది. కాబ‌ట్టిఈ బ్లాక్ టీ తాగ‌డం తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

  • బ‌ల‌హీన మైన రోగ‌నిరోధ‌క‌శ‌క్తి అనారోగ్యం భారీన ప‌డే ప్ర‌మాదాన్ని పెంచుతుంది. బ్లాక్ టీ యాంటీ ఆక్సిడెంట్ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ టీ తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది. ఈ బ్లాక్ టీలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు.. శ‌రీరంలో శ‌క్తి ప్ర‌స‌ర‌ణ‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ప్ర‌తీ రోజు ఉద‌యం పూట బ్లాక్ టీ ఎంతోఓ మంచిది అని పుణులు పేర్కొంటున్నారు.

Also Read :  భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్లు తాగ‌వ‌చ్చా..? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలంటే..?

  • బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గుతుంద‌ని నేష‌న‌ల్ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి అయింది. బ్లాక్ టీ పాలి ఫెనాల్స్‌ను క‌లిగి ఉంటుంది. క‌ణితి పెరుగుద‌ల ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. చ‌ర్మం, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ ప్ర‌మాదాన్ని కూడా తగ్గిస్తుంది.

  • బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇక ఈ బ్లాక్ టీని క్ర‌మం త‌ప్ప‌కుండా తాగడం వ‌ల్ల గుండెకు సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. ఇది అధిక ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. ప్ర‌తి రోజూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో బ్లాక్ టీ తాగ‌డం ఎంతో మంచిది.

Also Read :  ల్యాప్ టాప్ స్క్రీన్ గీత‌లు, మ‌ర‌క‌లు ఉన్నాయా..? ఇలా చేస్తే అన్నీ మ‌టుమాయం

Visitors Are Also Reading