Home » బాలకృష్ణ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బాలకృష్ణ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji

నందమూరి నటసింహం,  హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అడపాదడపా ఆహాలో అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న బాలయ్యకి టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని ఎవ్వరూ లేరు.  ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ సినిమా లైఫ్ లో చాలా దూసుకుపోతున్నారు. అయితే బాలకృష్ణ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చాలా మందికి తెలియదు. బాలకృష్ణ ఫ్యామిలీ కంటే ఆయన వివాహం చేసుకున్నటువంటి వసుంధర ఫ్యామిలీ చాలా ధనిక ఫ్యామిలీ అట.  ఆమెను బాలయ్య  ఎలా పెళ్లి చేసుకున్నారు.. ఆ వివరాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్టీఆర్ సంతానంలో బాలకృష్ణ చిన్నవాడు. ఆయన అంటే..  ఇంట్లో వాళ్లందరికీ చాలా ఇష్టం.  అయితే అందరికి పెళ్లిళ్లు అయ్యాయి బాలకృష్ణ పెళ్లి కోసం బసవతారకం  ఎన్టీఆర్ ను చాలా ఒత్తిడి చేసిందట. హడావిడిలో ఉన్న ఎన్టీఆర్ తన పెళ్లి విషయాన్ని తన మిత్రుడైనటువంటి నాదెండ్ల భాస్కరరావు అప్పగించారట.దీంతో ఆయన బంధువు దేవులపల్లి సూర్యారావు కూతురు అయినటువంటి వసుంధరనే చూపించారు. మొదటి చూపులోనే వసుంధర అందరికీ నచ్చేసింది. దీంతో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. 1982 డిసెంబర్ 8న వసుంధర, బాలకృష్ణ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

దేవరపల్లి సూర్యారావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ స్పోర్ట్స్  యజమాని. కొట్లాది ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తి. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వసుంధర బాలకృష్ణని పెళ్లి చేసుకుంది. ఈ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదు, కానీ వారు ఉండడానికి హైదరాబాదులో 10 లక్షల రూపాయలు పెట్టి ఆ కాలంలోని ఇల్లు కట్టించారట వసుంధర కుటుంబీకులు. ప్రస్తుతం వీరికి తేజస్విని, బ్రాహ్మణి, మోక్షజ్ఞ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో బ్రాహ్మణి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. చంద్రబాబు కోడలుగా.. లోకేష్ భార్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

Visitors Are Also Reading