సాధారణంగా ఏ చిన్న లోపం ఉంటే దానిని చూసి కృంగిపోయే వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉంటుంటారు. కానీ జబర్దస్త్‌లో కొందరున్నారు. వారిలో ఉన్న లోపాన్ని జనాలకు చెబుతూ పాపులారిటీని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఇమ్మాన్యుయేల్ చూడడానికి కాస్త నల్లగా ఉండి జుట్టు కూడా సరిగ్గా ఉండదు. అయినా కూడా తన కలర్, జుట్టు గురించి జోకులు వేస్తూ వేయించుకుంటూ పాపులారిటీని సంపాదించుకుంటాడు. నూకరాజు ఇతర కమెడియన్స్ అంతా కూడా తమలో ఉన్న లోపాన్ని చూపించుకుంటూనే పాపులారిటీని సొంతం చేసుకొని సక్సెస్ అయ్యారు. జబర్దస్త్ లో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రసాద్ ఇప్పుడు పంచ్ ప్రసాద్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు.
Advertisement
ఈ మధ్య కాలంలో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకు ఏకంగా ప్రాణమాయం ఉన్నదంటూ వైద్యులు చెప్పారు. ఆ సమయంలో తనకు బాసటగా నిలిచిన యువతిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ టీవీలో దాదాపు అన్ని షోలలో కనిపిస్తున్నాడు. తన భార్య, పాపను కూడా తీసుకొచ్చి తన మీద, తన ఆరోగ్యం, మీద, బార్య మీద జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, ప్రత్యేక ఈవెంట్స్ ఇలా అన్ని చోట్ల కూడా పంచ్ ప్రసాద్ కనిపిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో హాస్పిటల్ ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బంది పడిన ప్రసాద్ ఇప్పుడు నెలకు మూడున్నర లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.
Advertisement
Also Read : పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో తెలుసా ?
లక్షన్నర రూపాయలు తన ఆసుప్రతి ఖర్చులకు ఉపయోగించుకున్నాడు అని సమాచాం తెలుస్తోంది. జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కొందరి దాతల కారణంగా ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రిలో వైద్యం ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయట. సదరు ఆసుపత్రి వారు చాలా తక్కువ మొత్తానికి చికిత్స అందిస్తున్నారట. ప్రతి నెల కూడా ప్రసాద్ తన ఆదాయంతో బ్యాంకు బ్యాలెన్స్ ని భారీగా పెంచేసుకుంటున్నారట. ఇదంతా కేవలం అతని లోపం కారణంగానే అనడంలో సందేహం లేదు. తన అనారోగ్యం చూసుకొని తనకు తాను బాధపడి ఇంట్లో ఉండి ఉంటే కచ్చితంగా ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. కాబట్టి ఈ తరం యువత తప్పకుండా పంచ్ ప్రసాద్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని తమలో ఉన్న లోపాలను ఇబ్బందులను అధిగమించి కెరీర్‌లో ముందుకు సాగి సక్సెస్ సాధించాలని కోరుకుందాం.
Also Read : దీపికా,రణవీర్ విడాకులు తీసుకోబోతున్నారా..?