Home » బ్రహ్మనందం మొదటి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బ్రహ్మనందం మొదటి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఇండియాలోనే రిచెస్ట్ కమెడీయన్ గా పేరు సంపాదించుకున్నారు. కేవలం ఆస్తి, పాస్తుల్లోనే కాదు.. సినిమాల్లో కూడా తనను మించిన ఇప్పటి జనరేషన్ కమెడీయన్ లేడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి కమెడీయన్ బ్రహ్మనందం మొదటి జీతం ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఎందుకు అంటే..? ఆయన తొలిసారి వేతనం మరీ అంత తక్కువా అని ఆశ్చర్యపోతారు. బ్రహ్మనందం మొదటి జీతం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

బ్రహ్మానందం రీసెంట్ గా తన ఆత్మకథని రాసుకున్న విషయం తెలిసిందే . ఆ బుక్ లో తన గురించి ఎన్నో తెలియని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు రాసుకున్నారు. బ్రహ్మానందం B.A. డిగ్రీ పూర్తి  చేశాక.. M.A. చేద్దాం అనుకునే సమయంలో ఆయనకు ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరు లో తన టాలెంట్ చూసి ఫ్రీగా సీటు ఇచ్చారట. కానీ హాస్టల్ లో ఉండి చదువుకోవడం కోసం డబ్బులు కావాల్సి వచ్చిందట. ఆయన చదువుకి అప్పటికే అనసూయమ్మ  హెల్ప్ చేస్తున్నప్పటికీ తిండికి మరికొన్ని ఖర్చులకి ఆమెను డబ్బు అడగాలంటే నామూషీగా అనిపించి బ్రహ్మానందం ఏదైనా పని చేయాలి అనుకున్నారట. అలా ఓ రోజు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన లారీలు క్లీన్ చేసేవాళ్లు, అలాగే రిపేర్ చేసే వాళ్ళు, లారీలపై బొమ్మలు వేసే వాళ్ళు కనిపించారట.

Advertisement

అయితే బ్రహ్మానందం చాలా మంచి ఆర్టిస్టు.. ఆయన బొమ్మలు బాగా వేస్తారు. ఈ కారణంతో తనకి ఏదైనా పని దొరుకుతుంది కావచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగారట. ఇక వాళ్లు కూడా బ్రహ్మానందం కి బొమ్మలు వచ్చు అని తెలియడంతో రేపటి నుంచి పనిలో జాయిన్ అవ్వు అని చెప్పారట. ఇక మరుసటి రోజు నుంచి ఓవైపు చదువుకుంటూనే మరోవైపు లారీలపై పెయింటింగ్ వేస్తూ వచ్చిన డబ్బును తన ఖర్చులకు వాడుకునే వారట. అలా ఆయన లారీలపై పెయింటింగ్ వేస్తే నాలుగు నుండి ఐదు రూపాయలు ఇచ్చేవారట. అలా ఆయన మొదటి జీతం నాలుగు రూపాయలు.. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజుకి నాలుగు వేలు వచ్చినా కూడా ఇల్లు గడవని పరిస్థితి. అలాంటిది నాలుగు రూపాయలతో బ్రహ్మానందం తన జీవితాన్ని మొదలుపెట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading