సాధారణంగా అరటి పువ్వులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆ పోషకాలు మనకు చేసే మేలు గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. అరటిచెట్టు మానవుడికి అవసరమైన అరటిపండ్లను, పువ్వులను ఆహారంగా అందిస్తుంది. అందులో ఉండే పోషకాలు మానవుడికి చాలా అవసరం. అరటి పువ్వును ఎలా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముందుగా అరటి పువ్వును అరటి చెట్టు నుంచి తీయాలి. హెల్తీ వెజిటబుల్ గా భావించే అరటిపువ్వు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటి పువ్వులను తరచూ తినేవారికి గాయలు అయినట్టయితే త్వరగా మానిపోతాయి. అరటిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. మన శరీరంలో పలు రకాల వ్యాధుల నుంచి బయటపడేస్తాయి. మన శరీరంలో పలు రకాల వ్యాధుల నుంచి బయటపడేస్తాయి. అలాంటి పువ్వులు నిత్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అరటిపువ్వును ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి వీరికి చాలా మేలు చేస్తాయి. ఆడవారికి నెలసరిలో అధిక రక్తస్రావం అవుతుంటే ఒక కప్పు ఉడికించి తినడం వల్ల రక్తస్రావం ఆగి నెలసరిలో ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది.
Advertisement
ఆహారంలో తరచూ తింటుంటే వారికి బలాన్ని ఇచ్చి రక్త వృద్ధిని కలిగిస్తుంది. ఎర్ర రక్తకనాలను వృద్ది చేసి రక్తం పట్టేవిధంగా చేస్తుంది. అరటిపువ్వులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి. అలాగే పోటాషియం, ఫైబర్ కూడా ఉంటాయి.కాబట్టి ప్రతీ వయస్సు వారికి మంచి ఆహారం.. ఎవరు అయితే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్నారో వారు తరచూ అరటిపువ్వులను ఏదో ఒక విధంగా తింటుంటే వారికి మానసిక ఆహ్లాదాన్ని ఇచ్చి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా సహాయం చేస్తుంది. పాలు ఇచ్చే తల్లులు బిడ్డకు పాలు సరిపోవడం లేదని బాధపడుతుంటారు. ఈ అరటిపువ్వు తినడం వల్ల అలాంటి సమస్య తగ్గిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం అరటిపువ్వును తినండి.. ఆరోగ్యంగా ఉండండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అల్లంతో ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మీకు తెలుసా ?
మహిళల్లో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట..3వది ముఖ్యం !