ప్రపంచంలోనే అత్యధికంగా క్రేజ్ ఉన్నటువంటి ఆటలలో ఫుట్ బాల్ ఒకటి. గత కొద్ది రోజులుగా రసవత్తరంగా కొనసాగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ ఎట్టకేలకు ముగిసింది. ప్రపంచ కప్ 2022 ఫైనల్లో అర్జెంటీనా జట్టును విశ్వవిజేతగా నిలిపాడు లియెనెల్ మెస్సీ. ఈ ఈవెంట్ తరువాత మెస్సీ స్థాయి మారడోనాతో సమానంగా మారిపోయింది. ప్రస్తుతం ఏ ఇద్దరి మధ్య చర్చ జరిగినా మెస్సీ గురించే చర్చించుకోవడం వివేషం. అర్జెంటీనా సారధిగా ఫిఫా వరల్డ్ కప్ 2022ను గెలిపించిన మెస్సీ.. ఆ తరువాత టోర్నీలో అత్యుత్తమ ప్లేయర్ కి అందించే గోల్డెన్ బాల్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. మొత్తం 7 గోల్స్ నమోదు చేయడంతో పాటు రెండు ముఖ్యమైన అసిస్ట్ లు అందించి వావ్ అనిపించాడు మెస్సీ.
Advertisement
ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్ బాల్ కీలక ఆటగాడు మెస్సీ సంపాదన గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతీ గంటలకు $8,790 అనగా.. రూ.7.25 లక్షలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. అతను ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అర్జిస్తున్న అథ్లెట్ గా ఉన్నాడు. నవంబర్ 2022 నాటికి మెస్సీ నికర విలువ 600 మిలియన్ డాలర్లు.. అనగా రూ.4,952కోట్లు. ప్రపంచంలోనే అతడు అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్లలో ఒకడు మెస్సీ. కేవలం క్రీడలత పాటు పుల బ్రాండ్ల ప్రచారం ద్వాారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. మే 2021 నుంచి.. మే 2022 వరకు మెస్సీ ఆన్, ఆఫ్ ఫీల్డ్ సంపదన $130 మిలియన్లు అని చెబుతుంటారు. అతను ఫీల్డ్ లో 75 మిలియన్ డాలర్లు సంపాదించగా.. ఆఫ్ ఫీల్డ్ లో 55 మిలియన్ డాలర్లు సంపాదించాడు. మెస్సీ రోజువారి సంపాదన రూ.1లక్ష5వేల డాలర్లు అని టాక్ వినిపిస్తోంది.
Advertisement
బార్సిలోనాలో మెస్సికి నో ఫ్లై జోన్ బంగ్లాతో పాుట మోట్ ఉంది. మెస్సీ బంగ్లాలో ప్రత్యేకమైన ప్రయివేటు ఫుట్ బాల్ మైదానం ఉంది. అతడికి ఒక లగ్జరీ హోటల్ ఉంది. స్పెయిన్ లోని ఇబిజా ద్వీపంలో మెస్సీ తన సెలవులను గడిపేందుకు బంగ్లాని నిర్మించుకున్నాడు.మెస్సీకి చాలా హై స్పీడ్ కార్లుండగా.. అందులో రెండు మిలియన్ డాలర్ల పగని జోండా ట్రైకలర్, మస్సెరాటి గ్రాన్ టురిస్మో, ఫెరారీ ఎఫ్ 430 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్టీ8, ఆడీరేంజ్ రోవర్ కార్లున్నాయి.100 కోట్ల ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి. ఇందులో రెండు బాత్ రూమ్ లు, వంట గది, 16 మందికి పైగా సీటింగ్ ఉన్నాయి. 2006లో ఫుట్ బాల్ కెరీర్ ప్రారంభించిన మెస్సీకి వరల్డ్ కప్ నెగ్గడమే జీవితాశయం. 2014లో దాని అంచుల వరకు వెళ్లినా కూడా తన ఆశ మాత్రం నెరవేరలేదు. ఎట్టేలకు 36 ఏళ్ల తరువాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి ఫుట్ బాల్ ప్రపంచానికి రారాజుగా పట్టాభిషేకం పొందాడు. పైనల్స్ ప్రాన్స్ ని ఓడించి 15 అంగుళాల బంగారు కప్పును తన చేతిలోకి తీసుకుని సంబురం చేసుకున్నాడు.
Also Read : FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా..ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా ?