హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ బలిని ఆచారా ప్రకారం పూజిస్తారు. ఆంజనేయుడికి ఇష్టమైన ప్రసాదాన్ని అందిస్తారు. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలను అందించడం ద్వారా ఆయన చాలా సంతోషిస్తాడు. భక్తుల కోరికలను తీరుస్తాడు అని చెబుతారు. అంతేకాదు.. జీవితంలోని ఇబ్బందులను తొలగించడం పురోగతికి మార్గం తెరుస్తుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు బజరంగబలికి ఇష్టమైన ఈ 8 ప్రసాదాలను అందిస్తే ఆనందం లభిస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంజనేయుడికి మోతీచూరు లడ్డు అంటే చాలా ఇష్టం. ఈసారి హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగబలి మోతీచూర్ నెయ్యి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల భక్తులకు అన్ని కోరికలు నెలవేరుతాయి. ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు.
Advertisement
బేసన్ లడ్డులు హనుమంతుడికి చాలా ఇష్టం. మంగళవారం, శనివారాలతో పాటు.. హనుమాన్‌జయంతి నాడు కూడా బజరంగబలికి ఈ బేసన్‌లడ్డులను నైవేద్యంగా సమర్పించాలి. శనగపిండి లడ్డులను నైవేద్యంగా సమర్పించడం వల్ల హనుమంతుడు భక్తుల కోరిన కోర్కెలు తీరే వరాన్ని ఇస్తాడు. జాతక దోషాలు కూడా తీరిపోతాయని నమ్ముతారు.
జీవితంలోని ఇబ్బందులు, అడ్డంకులను తొలగించడానికి హనుమాన్ జయంతి సందర్భంగా జబరంగబలికి తమలపాకులుసమర్పించండి. హనుమంతుడు పాన్ ప్రసాదంతో చాలా సంతోషిస్తాడు. భక్తుల కోరికలన్నింటిని తీరుస్తాడని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజు పూజ తరువాత బజరంగబలికి పాన్ సమర్పించండి.
ఆంజనేయుడికి జాంగ్రీ కూడా చాలా ప్రియమైనది. హనుమాన్ జయంతి రోజు బజరంగ బలికి జాంగ్రీ ప్రసాదాన్ని అందించండి. ఈ రోజు ఇలా చేస్తే.. హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. జాంగ్రీ అందించడం ద్వారా జీవితంలోని భయాలన్ని తొలగిపోతాయి.
Advertisement
ఆంజనేయుడికి కేసరి బాత్ సమర్పిస్తారు. దీనిని నైవేద్యంగా పెట్టడం ద్వారా మంగళశాంతి కలుగుతుంది. హనుమంతుడు చాలా త్వరగా కేసరి బాత్ ఆస్వాదించడంతో సంతోషిస్తాడు. ఈసారి హనుమాన్ జయంతి బజరంగబలికి దీనిని తప్పక నైవేద్యంగా పెట్టండి.
హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ బలికి తీపి రొట్టెలు అందించండి. గోదుమ పిండిలో బెల్లం, యాలకులు, కొబ్బరిపొడి, నెయ్యి పాలు కలిపి ఈ రోటిని తయారు చేస్తారు. మంగళ, శనివారాల్లో కూడా హనుమాన్‌కు తీపి రొట్టెలు సమర్పిస్తారు. మీరు దీనిని కాల్చి రోటీ మాదిరిగా చేసుకోవచ్చు. పూరీలా వేయించి ఆంజనేయుడికి ప్రసాదంగా అందించవచ్చు.
బెల్లం, శనగలు హనుమంతునికి చాలా ఇష్టం. ఈసారి హనుమాన్ జయంతి రోజు బజరంగబలికి ఇవి తప్పక అందించండి. ఆయన తప్పకుండా ప్రసన్నమవుతాడు. బజరంగబలిని ఆరాధించిన తరువాత.. అతనికి బెల్లం, శనగలను నివేదించి సింధూరం పూయండి. మీ కోరికలు నెరవేరాలని ప్రార్థించండి. హనుమంతుడికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.
ఆచార్య నుంచి అప్‌డేట్.. భలే భలే బంజారా సాంగ్ విడుదల ఎప్పుడంటే..?
బూందీ కూడా హనుమంతునికి నైవేద్యంగా పెడతారు. బూందీ ఎరుపు రంగులో ఉంటుందని గుర్తుంచుకోండి. హనుమాన్ జయంతి నాడు బజరంగబలిని పూజించిన తరువాత కచ్చితంగా అతనికి బూందీ సమర్పించండి. దీంతో హనుమాన్ చాలా సంతోషించి భక్తులపై తన ఆశీర్వదాలను కురిపిస్తారు.
ఇవి కూడా చదవండి :
- ఆచార్య నుంచి అప్‌డేట్.. భలే భలే బంజారా సాంగ్ విడుదల ఎప్పుడంటే..?
- రాముడు దేవుడే కాదు.. బీహార్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!
- నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లి పత్రిక…ఎన్టీఆర్ ఎంత కట్నం ఇచ్చారంటే..!