Home » రాముడు దేవుడే కాదు.. బీహార్ మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

రాముడు దేవుడే కాదు.. బీహార్ మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by Anji
Ad

రాముడు దేవుడు అని.. దేశ‌వ్యాప్తంగా ఎన్నో స్థ‌లాల‌లో శ్రీ‌రాముడి కోసం దేవాల‌యాలు, మందిరాలు ఏర్పాటు చేసి భ‌క్తులు ఆరాధిస్తుంటారు. కానీ ఆ రాముడి గురించి బీహార్ మాజీ మాజీ సీఎం ఏమ‌న్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రామాయ‌ణాన్ని వాల్మీకి, తుల‌సిదాస్ రాసార‌ని, త‌మ సందేశం కోసం రాముడు అనే పాత్ర‌ను సృష్టించారు అని మాంఝీ వ్యాఖ్యానించి వివాదాల్లోకి ఎక్కారు. రాముడు కేవ‌లం రామాయ‌ణంలోని ఓ పాత్ర మాత్ర‌మే త‌ప్ప దేవుడే కాదు అని.. మాంఝీ చెప్పారు.

రాముడిపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. శ‌బ‌రి ఇచ్చిన ఎంగిలి ప‌ళ్లాల‌ను రాముడు తిన్నాడ‌ని మీరు న‌మ్ముతారు. కానీ మేము కొరికి ఇచ్చిన ఎంగిలి ప‌ళ్లాల‌ను మీరు మాత్రం తిన‌రు. క‌నీసం మేము తిన్న వాటిని తాక‌ను కూడా తాక‌ర‌ని హిందుత్వ‌వాదాల‌పై మాంఝీ మండిప‌డ్డారు.

Advertisement

దేశంలో ఉన్న‌వి రెండే కులాలు అని.. ఒక‌టి డ‌బ్బు ఉన్నోళ్లు.. ఇంకొక‌ళ్లు పేద‌లు అని జీత‌న్ రామ్ మాంఝీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మాంఝీ కుమారుడు సంతోష్ బీహార్‌లో నెల‌కొన్న బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రి. వివాద‌మే రాజ‌కీయం. రాజ‌కీయ‌మే వివాదం. దేవుళ్ల‌తో రాజ‌కీయం చేయ‌టం ఇలాంటోళ్ల‌కు టైమ్‌పాస్‌.

ఇవి కూడా చదవండి :

  1. జబర్దస్త్ కు హైపర్ ఆది గుడ్ బై…?
  2. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టిన రాధిక…అసలు ఏం జరిగిందంటే….!
  3. 23న విజ‌యవాడలో ఆచార్య ప్రీ రిలీజ్‌.. చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే..?
Visitors Are Also Reading