Home »  వానాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే.. చర్మ వ్యాధులు దరిచేరవు..?

 వానాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే.. చర్మ వ్యాధులు దరిచేరవు..?

by Sravanthi
Ad

మనం గత మూడు నెలల నుంచి విపరీతమైన ఎండలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎండ వేడి నుంచి కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి వేడి బారి నుంచి మన శరీరాన్ని రక్షించుకున్నాము. ప్రస్తుతం చల్లని గాలులు, చిరుజల్లులతో వానాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడే మొదలవుతుంది అసలు సమస్య. వాన కాలంలో ఎక్కువగా అంటు వ్యాధులు, చర్మవ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతాయి.

ముఖ్యంగా చర్మ వ్యాధుల నుంచి వానాకాలంలో తప్పించుకోవాలంటే ఇవి తప్పక పాటించాల్సిందే.. అవేంటో ఒకసారి చూద్దాం..? సాధారణంగా వర్షాకాలంలో వివిధ రకాల చర్మ వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే కొన్ని రకాల పండ్లు తింటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఆపిల్ : ఆపిల్ తినడం వల్ల చర్మం సాగిపోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది.

పుచ్చకాయ : పుచ్చకాయ ఎక్కువగా ఎండాకాలంలో దొరుకుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏ కాలంలోనైనా మార్కెట్లలో అవైలబుల్ లో ఉంటున్నాయి. ఇవి శరీరానికి కావలసినంత నీటిని పుష్కలంగా అందిస్తాయి. దీనివల్ల చర్మ వ్యాధులు దరిచేరవు

Advertisement

అరటిపండు: అరటిపండు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

బ్లూ బెర్రీస్ : విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ పండ్లలో పుష్కలంగా లభిస్తుంది.ఇవి తినడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు.

దానిమ్మ: ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు రాకుండా నిగనిగలాడే విధంగా చేస్తుంది.
ఇవే కాకుండా మార్కెట్లో చాలా ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి. వీటిని మనం తినడం వల్ల వాన కాలంలో వచ్చే చర్మ వ్యాధులు మరియు జలుబు, జ్వరం వంటి వాటి నుంచి కూడా రక్షించుకోవచ్చు.

also read;

ఒకప్పటి హీరోయిన్ టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో అని తెలుసా ?

ఏఆర్ రెహ‌మాన్ పెద్ద కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియో మీరు చూశారా..?

 

Visitors Are Also Reading