సాధారణంగా మానవ మెదడు యొక్క కణాల ఆయుర్దాయం 150 ఏళ్లు. తల్లి గర్భంలో ఉండగానే మెదడు కణ నిర్మాణం ప్రారంభం అవుతుంది. తొలి రెండేళ్లలోపు బిడ్డకు బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. అందుకే చంటి పిల్లలకు శరీరం సన్నగా ఉన్నా, తలకాయ పెద్దగా ఉంటుంది. ఈ బాడీని నడిపించే మెదడు పూర్తిగ తయారు అవుతుంది అన్నమాట. ఒక్కోసారి మెదడు కణాలు చనిపోతే తిరిగి పుట్టడం ఉండదు. మెదడు కణాలు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.
Also Read : ఈ సీజన్ లో లభించే సపోటా పండ్లను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
Advertisement
మెదడు కణాలను డ్యామేజ్ చేయడానికి వాటిని వీక్ చేయడానికి కారణమయ్యే కొన్ని రకాల హానికర ప్రోటీన్స్ లోపల విడుదలై బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంటాయి. అవే టార్ బీటా ఏమలిట్స్ అనే ప్రోటీన్స్. ఇవి బ్రెయిన్ సేల్స్ ని డ్యామేజ్ ని చేస్తుంటాయి. బ్రెయిన్ సేల్స్ ని డ్యామేజ్ చేయకుండా మిరియాలు బాగా సహాయపడుతాయి. మిరియాలు బ్రెయిన్ సేల్స్ ని నాశనం చేసే ప్రోటీన్స్ ని నాశనం చేస్తాయి. బ్రెయిన్ సెల్స్ నశించకుండా పెద్ద వయస్సు వచ్చే కొద్ది మతిమరుపు రాకుండా మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి మిరియాలు ఉపయోగపడుతాయి.
Advertisement
దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి మిరియాల పొడి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మిరియాల పొడి సహాయపడుతుంది. మనం తినే ఆహారాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేసుకొని తింటే మంచిది.సలాడ్స్ లలో ఈ పొడిని చల్లుకొని తింటే చాలా మంచిది. కేవలం దగ్గు కఫం వంటి సమస్యలను తొలగించడమే కాదు.. మెదడు కణాలను రక్షించడానికి కూడా మిరియాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి. అందుకే మిరియాలను పలు రూపాల్లో తినే ఆహారంలో తీసుకోగలిగితే మెదడు కణాలు చనిపోకుండా సురక్షితంగా ఉంటాయి.
Also Read : ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగవచ్చా? రోజు తాగితే ఏమవుతుంది?