ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ బరువు తగ్గడం ఓ సమస్యగానే మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య వెంటాడుతుంది. దీని ఫలితంగా చాలా మందికి కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వాారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కరివేపాకు మంచి సువాసన కలిగినటువంటి పదార్థం. దక్షిణ భారతదేశంలో వంటల్లో తప్పకుండా కరివేపాకును విరివిగా ఉపయోగిస్తారు. వంటల రుచిని పెంచడానికి కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కరివేపాకుతో శరీరంలోని చాలా సమస్యలు దూరమవుతాయి. ఇందులో స్థూలకాయం ప్రధానమైంది. పొట్ట,నడుము భాగాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే.. కరివేపాకు జ్యూస్ తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.
Advertisement
ఇందులో ఉండే ఆల్కలాయిడ్ల సహాయంతో లిపిడ్, ఫ్యాట్ కరిగించవచ్చు. కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గించవచ్చు. దీంతో పాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. జ్యూస్ తయారు చేసేందుకు తొలుత కరివేపాకులను కడిగి నీటిలో ఉడికించాలి. కొద్ది సేపు అయిన తరువాత ఈ నీటిని వడకచి గోరువెచ్చగా తాగాలి. రుచికోసం అవసరమైతే.. నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవాలి. కరివేపాకు జ్యూస్ ని కేవలం పరగడుపున మాత్రమే తీసుకోవాలి.