ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలిని అనుసరించి ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్ నెస్ కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడం చాలా కష్టమైనప్పటికీ ఉదయం పూట జ్యూస్ లు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఏయే రసాలను తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
క్యారెట్ జ్యూస్ :
క్యారెట్ జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగువుతుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి కూడా బలంగా తయారవుతుంది. మరోవైపు మీరు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Also Read : మళ్ళీ ప్రభాస్ కు అనారోగ్యం..?
Advertisement
క్యాబేజీ రసం :
క్యాబేజీ రసం కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల పొత్తి కడుపు వాపుతో పాటు బరువు తగ్గుతుంది. క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అజీర్తి సమస్య కూడా దూరమవుతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి.
దుంపల రసం :
దుంపల రసం శరీరానికి చాలా మేలు చేస్తుంది. దుంపలతో తయారు చేసిన జ్యూస్ లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి అలసట కూడా దూరమవుతుంది. ముఖ్యంగా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
Also Read : పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా… అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!