1960 నాటి కాలం గుడిగంటల షూటింగ్ జరుగుతుంది. అందులో ఎన్టీఆర్ హీరో ఆ పాత్ర బాగా సిగరేట్‌లు తాగుతూ సాగుతుంది. వాస్తవానికి రామారావు సాధారణంగా సిగరేట్‌లు కాల్చారు. కానీ ఏదైనా సినిమాలో కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బుల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరేట్ లే కాల్చేవారు. గుడిగంటలు స్కెడ్యూల్ లో ఆయన కోసం రోజు రెండు డబ్బుల స్టేట్ ఎక్స్‌ప్రెస్ ప్రాన్ సిగరేట్ లు తెప్పించి రెడీగా ఉంచేవారు.
ఈ సినిమాకు నిర్మాత డూండీ, వి.మధుసూదన్ రావు దర్శకుడు. ఆ రోజుల్లో స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరేట్‌లు గుండ్రటి డబ్బాలో వస్తుండేవి. ఒక్కో దాంట్లో 20 సిగరేట్‌లు ఉండేవి. సినిమాలో కొన్ని చోట్ల ఎన్టీఆర్ చేతిలో ఈ డబ్బా చేతిలో ఈ డబ్బా కూడా కనిపించేది. పారెన్ సిగరేట్స్ కదా అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు. రోజు ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ వద్దకు ఒక డబ్బా చేరిపోవాలి. తరువాత మధ్యాహ్నం భోజనం సమయానికి మరొక డబ్బా చేతికి అందించాలి. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నాడు ముళ్లపూడి. సమయానికి సిగరేట్‌లు లేవు. నిర్మాత డూండీ ఎన్టీఆర్ కోసం తెప్పించిన డబ్బా సీల్ తీశారు. చివరకు ఏం చక్కగా సిగరేట్ ఊది పారేశారు. ఈలోపు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకొని మేకప్ చేయించుకుని సిగరేట్ డబ్బా కోసం కబురు పంపారు.
Advertisement
Advertisement
బాయ్ తెచ్చి అందించాడు. సీల్ తీసి ఉండడం చూసి ఎన్టీఆర్ కు చిర్రెత్తింది. కోపంతో కేకలు వేశాడు. బాయ్ భయంతో పరుగున వెళ్లి సార్ హీరో ఫైర్ అయిపోతున్నారు. ఎవరో సిగరేట్ డబ్బా సీల్ తీసి 2 సిగరేట్‌లు కాల్చారు. అన్నరాట డూండీతో. అయితే ఏంటంటా వెళ్లి చెప్పు నిర్మాత ఒకటి, దర్శకుడు ఒకటి కాల్చాలని అన్నారు. ఎన్టీఆర్ కోపాన్ని డూండీ లైట్ తీసుకున్నారు. బాయ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి బుల్లెట్ వేగంతో వెనక్కి వచ్చాడు. తనకు ఫుల్ టెన్ కావాల్సిందేనట లేకపోతే హీరో సెట్కు రానంటున్నారు అని చేదు కబురు పెట్టారు. డూండీ తప్పేముంది ఈ సిగరేట్ డబ్బా కోసం పంచాయతీ ఎందుకు తెప్పిస్తే పోలా అనుకున్నాడు. మద్రాస్‌లో ఎక్కడున్నా సరే అర్జెంట్‌గా ఓ సిగరేట్ డబ్బా తీసుకురాపో అన్నాడు.
మామూలుగా టీనగర్ ఆంధ్రాకిల్లీ షాప్‌లో ఈ ఫారెన్ సిగరేట్‌లు చాలా దొరుకుతాయి. కానీ ఆరోజు అక్కడికి వెళ్లే స్టాక్ అయిపోయింది అని చెప్పాడు సదరు కిల్లీ కొట్టు కైలాసం. ఇంకా ఎక్కడ దొరకవచ్చు అని అడిగితే అడ్రస్ చెప్పాడు. అక్కడికి ఆరు మైళ్ల దూరం. ఫ్యారిస్ కార్నర్‌లోని కాసిచెట్టు వీధి అక్కడికి ఆగమేఘాల మీద వెళ్లాడు చిట్టిబాబు. ఇక్కడ ఎన్టీఆర్ తుమతుమలాడిపోతున్నారు. ఆ దూపం కోసం పొగలు కక్కుతున్నారు. తీరా కొత్త సిగరేట్ డబ్బా తీసుకొచ్చే సరికి టైమ్ 4 అయింది. అప్పుడు ఎన్టీఆర్ మేకప్ రూమ్ నుంచి సెట్ లోకి రాలేదు. షూటింగ్ జరగలేదు. ఆయన కోపాన్ని గమనించి చల్లార్చడానికి నిర్మాత డూండీతో పాటు రమణ కూడా ఎన్టీఆర్‌కు సారీ చెప్పారు. సిగరేట్ కోసం కాదు బ్రదర్ డిసిప్లీన్ ఆ ప్రిన్సిపల్‌కు నేను కూడా అతిథున్ని కాదని కూల్‌గా నడిచారు షాట్ కోసం ఎన్టీఆర్.
ఇవి కూడా చదవండి :
- సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార’ పాట పాడిన సింగర్ ఇండస్ట్రీ లో ఎదగకుండా తొక్కేసారా?
- చాణక్య నీతి ప్రకారం ఈ మార్గాల ద్వారా సంపాదించినా డబ్బు ఎప్పటికీ నిలవదట !
- ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో మీకు తెలుసా..!