Home » సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార’ పాట పాడిన సింగర్ ఇండస్ట్రీ లో ఎదగకుండా తొక్కేసారా?

సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార’ పాట పాడిన సింగర్ ఇండస్ట్రీ లో ఎదగకుండా తొక్కేసారా?

by Anji
Published: Last Updated on
Ad

రాజ్ సీతారామ్ గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఆయ‌న అస‌లు పేరు రాజ్ సీతారామ‌న్ అత‌ని సొంత స్వ‌గ్రామ త‌మిళ‌నాడులో త‌ర‌న‌ల్‌వేలి అత‌ను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ త‌రువాతే సినిమాలోకి వ‌చ్చారు. కే.వీ.న‌ట‌రాజ భాగ‌వ‌తార్ ద‌గ్గ‌ర శాస్త్రీయ సంగీతాన్ని అభ్య‌సించి 16 ఏళ్ల వ‌య‌స్సులో జ‌య‌సుధాక‌ర్ బృందంలో చేరి స్టేజీల మీద పాట‌లు పాడ‌డం ప్రారంభించారు. ఆ త‌రువాత బాలు గ్రూపులో కూడా కొంత‌కాలం పాటలు పాడారు. అదే బాలుగారికి పోటీగా పాడాల్సి వ‌స్తుంద‌ని ఆ కుర్రాడికి తెలియ‌క‌పోవ‌చ్చు.

Advertisement

త‌రువాత శృతి, ల‌య పేరుతో త‌నే సొంతంగా ఓ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని సంగీత క‌చేరీలు చేసేవారు. చెన్నై వివేకానంద క‌లాశాల‌లో బీఏ ఏకాన‌మిక్స్ చ‌దువుతూ సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాలు పెట్టారు. తెలుగు సినిమాకు సంబంధించి సంగీత ద‌ర్శ‌కుడు స‌త్యం తొలిసారి అగ్నిస‌మాధి అనే సినిమాలో రాజ్ సీతారామ్‌తో పాడించారు. ఆ త‌రువాత దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శోభ‌న్‌బాబు సినిమా జ‌గ‌న్‌లో ఒక‌రాత్రి అనే పాట‌ను చ‌క్ర‌వ‌ర్తి సంగీత ద‌ర్వ‌క‌త్వంలో పాడారు. ర‌మేష్ నాయుడు సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూర్య‌చంద్ర సినిమాలో హీరో కృష్ణ‌కు అన్ని పాట‌లు తనే పాడే అవ‌కాశం వ‌చ్చింది. కృష్ణ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మంచి మిత్రులు అని ఇండ‌స్ట్రీలో పేరు ప‌డిపోయింది.


అయితే కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహాస‌నం సినిమాలో కూడా రాజ్‌సీతారామ్ పాట‌లు పాడ‌డంతో బాలు, కృష్ణ‌ల మ‌ధ్య బంధం కొన‌సాగ‌డం లేద‌నే మాట అప్ప‌ట్లో ప్ర‌చారం కొన‌సాగింది. 1985లో మొద‌లైన వివాదం 1988 వ‌రకు కొన‌సాగింది. మ‌హారాజ‌శ్రీ మాయ‌గాడు చిత్రానికా..? లేక రౌడీ నెంబ‌ర్ వ‌న్‌కు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ కోటి ప‌ట్టుబ‌ట్టి కృష్ణ‌-బాలును క‌లిపారు. అయితే అస‌లు కార‌ణం ఏమిటంటే సూర్య‌చంద్ర స‌మ‌యంలో కృష్ణ‌తో రెగ్యుల‌ర్‌గా సినిమాలు తీసే ఓ నిర్మాత‌తో బాలుకు చిన్న వివాదం జ‌రిగింది. ఆ బ్యాన‌ర్‌లో త‌న‌కు రావాల్సిన బ‌కాయి గురించి గ‌ట్టిగా అడిగాడు. ఆ విష‌యం కృష్ణ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. నేరుగా బాలుకే ఫోన్ చేసి ఏమిటండి.. డ‌బ్బులు ఇస్తే త‌ప్ప పాడ‌న‌న్నారంట‌.. కెప్టెన్ కృష్ణ స‌మ‌యంలో నాకు ఇవ్వాల్సిన బ‌కాయి కూడా పంపండి అని అనేశారని అడిగాడు. వారిద్ద‌రూ మాట్లాడుకున్న త‌రువాత‌ కృష్ణ నిర్మాత నుంచి బాలుకు రావాల్సిన బ‌కాయి వ‌చ్చేసింది.

Advertisement

 

అదేవిధంగా బాలు కూడా కృష్ణ‌కు బ‌కాయి ప‌డ్డ సొమ్ము ఇచ్చేసారు. ఆ క్ష‌ణం నుంచి మూడేళ్ల పాటు ప‌ని చేయలేదు వారిద్ద‌రూ. అలా చెడిన రిలేష‌న్ బాగు చేయ‌డానికి న‌డుం బిగించిన రాజ్‌కోటి స్వ‌యంగా బాల్‌తో మాట్లాడారు. కృష్ణ‌తో మాట్లాడిద్దామ‌నుకున్నారు. అయితే కాద‌ని బాలునే డైరెక్ట్‌గా తాను కృష్ణ‌ను ప‌ద్మాల‌యా ఆఫీస్‌లో క‌లిసి సారి చెప్ప‌బోయారు. అయితే కృష్ణ అవేవి ప‌ట్టించుకోకండి. అవేమి త‌వ్వ‌వ‌ద్ద‌ని షేక్ హాండ్ ఇచ్చి పంపించారు. అలా తిరిగి కృష్ణ‌కు బాలు పాడ‌డం ప్రారంభం అయింది. ఆ త‌రువాత రాజ్‌సీతారామ్ గాత్రం వినిపించ‌లేదు. అలా ఓ న‌టుడికి, గాయ‌కుడికి మ‌ధ్య మొద‌లైన యుద్ధం సుఖాంతంగా ముగిసింది. అవ‌తారం చాలించిన‌ట్టుగానే త‌రువాత సీతారామ్ ఎక్క‌డ కూడా క‌నిపించ‌లేదు. ఏమి జ‌రిగింద‌నేది ఎప్ప‌టికీ బ‌య‌టికి రాని ర‌హ‌స్యం.

అయితే ఇక్క‌డ జ‌వాబులు లేని కొన్ని ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. వాటి గురించి ఎవ్వ‌రూ చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు కూడా. బాలు గారు ఎలాగో లేరు. కృష్ణ అన‌వ‌స‌ర‌మైన వివాదాల్లో వేలు పెట్ట‌రు స‌రే. ఆ ప్ర‌శ్న‌లు ఏమిటంటే.. అంద‌రినీ క‌లుపుకొనిపోయేత‌త్వం ఉన్న కృష్ణ‌కే అంత కోపం వ‌చ్చిందంటే త‌ప్పు బాలువైపు ఉన్న‌ట్టే లెక్క‌. ఇద్ద‌రి మ‌ధ్య త‌గాదాల‌కు అస‌లు కార‌ణం ఏమిటి..? అందుకు కృష్ణ‌కు కోపం వ‌చ్చేవిధంగా బాలు ప్ర‌వ‌ర్త‌న ఏమై ఉంటుంది..? కృష్ణ కోపం తాటాకు మండ‌లాంటిది. సాయంత్రం వ‌ర‌కు చ‌ల్లారేది. యినా మూడేళ్లు బాలును ఎందుకు దూరం పెట్టారు. నువ్వు పాడ‌క‌పోతే లోకం ఆగిపోతుందా..? అన్న స్థాయిలో కృష్ణ‌కు కోపం వ‌చ్చిందంటే అది బాలు వైపు నుంచి ఎంత పెద్ద త‌ప్పు అయి ఉంటుంది. అది ఎప్ప‌టికీ హిస్ట‌రీనే. కృష్ణ కూడా రాజ్‌సీతారామ్‌ను నిర్దాక్షిణంగా ఎందుకు వ‌దిలేశాడు. నేను త‌ప్ప ఎవ‌రితో పాడించుకున్న నేను దూరం అవుతాను.. పాడ‌ను అనే ష‌ర‌త్ పెట్టాడా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌క‌డం క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం రాజ్ సీతారామ్ ఇషా ఫౌండేష‌న్ వాలంటీర్ గా ఉన్నారు. వివేకానంద క‌ళాశాల‌లో ఎకాన‌మిక్స్ డిగ్రీ పూర్తి చేసిన త‌రువాత రూరల్ మేనేజ్‌మెంట్ క‌లాశాల‌లో బీఏ చ‌దివారు. త‌రువాత సొంతంగా ఓ కంపెనీ పెట్టారు. అలా ముందుకు వెళ్లిపోయారు. కానీ సినిమా పాట‌లు ఇత‌ర క‌చేరీలు చేసిన‌ట్టు ఎక్క‌డ కూడా క‌నిపించ‌లేదు. ఏదేమైనా కానీ ప్రెస్టెజెస్ మూవీ సింహాస‌నంలో ఆకాశంలో ఓ తారా.. నాకోసం వ‌చ్చింది ఈ వేళ అనే పాటను అద‌ర‌గొట్టారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

  1. పూజ‌కు ఉప‌యోగించిన పూల‌ను ఏం చేయాలో తెలుసా..?
  2. చాణక్య నీతి ప్రకారం ఈ మార్గాల ద్వారా సంపాదించినా డబ్బు ఎప్పటికీ నిలవదట !
  3. ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో మీకు తెలుసా..!
Visitors Are Also Reading