భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు సిరీస్‌లు జరిగిన విషయం విధితమే. తాజాగా 5వ టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టర్ వేదికగా జరిగింది. నాలుగవ రోజు కేవలం 245 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్‌లో 132 బలమైన ఆధిక్యంతో 378 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని అందుకుంది. ఈ మధ్య ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కూడా 270 కంటే ఎక్కువ లక్ష్యాలను అలవొకగా ఛేదించింది. ఇక నాలుగవ రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ కేవలం 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.
Advertisement
ఇక ఐదవ రోజు ఆటలో దూకుడు కొనసాగించి విజయం సాధించింది. అయితే చరిత్రలో ఎన్నడూ లేనివిదంగా 378 పరుగులు ఛేదించి ఇంగ్లాండ్ జట్టు రికార్డునే సృష్టించింది. ఐదోటెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమానం అయింది. 378 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు జోరూట్ (142), జాని బెయిర్ స్టో (114) ఇద్దరూ సెంచరీలు సాధించారు. జోరూట్ 82 స్ట్రైక్ రేట్‌తో అతని కెరీర్‌లో 28వ సెంచరీ సాధించగా.. బెయిర్ స్ట్రో 78 స్ట్రైక్ రేట్‌తో 114 పరుగులు సాధించాడు. అతను వరుసగా నాలుగవ సెంచరీ సాధించడం విశేషం. ఓవరాల్‌గా అతనికిది 12వ సెంచరీ.
Advertisement
అయితే రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా భారత్ తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. ఇంగ్లాండ్ విజయంలో నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో ఉన్న హనుమ విహారి చేజార్చాడు. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. బెయిర్ స్టో 14 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద బతికిపోయి ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అత్యంత సులభమైన క్యాచ్ చేజార్చిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఆహా.. ఎంత పని చేశావు విహారి.. ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read :
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!
పెళ్లికి ముందే మీపార్ట్‌నర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా..?
Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs
— Shribabu Gupta (@ShribabuG) July 5, 2022