Home » ఈ మొక్కలను పెంచితే ఇంట్లోకి పిల్లులు అస్సలు రావు.. కారణం ఏంటంటే..?

ఈ మొక్కలను పెంచితే ఇంట్లోకి పిల్లులు అస్సలు రావు.. కారణం ఏంటంటే..?

by Anji
Ad

సాధారణంగా కొందరూ పిల్లిని ఇళ్లల్లో  చాలా ఇష్టంగా పెంచుకుంటారు. ఉదయం నిద్ర  లేచినప్పటి నుంచి పిల్లి మియావ్ .. మియావ్ అని అరుస్తూ తన యజమాని చుట్టు తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు.. పిల్లి మనముందు నుంచి వెళ్లినా కొందరు అస్సలు ఇష్టపడరు. పొరపాటున పిల్లి కనబడిన కూడా కొందరు అశుభంగా భావిస్తారు.ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. పిల్లులు మళ్లీ మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తాయా..? వాటికోసం కాపలా అవసరం లేదు.

Advertisement

పిల్లులకు పాయిజన్ లాంటివి. పిల్లుల కోసం ఐదు విషపూరిత మొక్కలు ఉన్నాయి. ఇది వీధి పిల్లులను ఇంటి నుంచి దూరంగా వెళ్లేలా చేస్తుంది. పిల్లులు ఎక్కువగా ఎలుకలు, పాలు వెతుకుతూ అవకాశం దొరికినప్పుడల్లా ఇంట్లో కి వస్తాయి. కొన్నిసార్లు పిల్లులు ఇంట్లో చాలా చెత్త వేసి మనస్సును కలవరపెడుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లులు ఇంట్లోకి రానివ్వకుండా  తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో పాటు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొన్ని చర్యలతో.. పిల్లులను శాశ్వతంగా ఇంటి నుంచి దూరంగా ఉంచవచ్చు. పిల్లులు దగ్గరకు రాకుండా కొన్ని మొక్కల గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

Advertisement

  • లావెండర్ సువాసన పిల్లులకు అస్సలు నచ్చదు. దానివల్ల అవి దాని చుట్టూ తిరగవు. 
  • పిల్లులు పుదీనా వాసన ఇష్టపడదు. మీ తోటలో పుదీనా నాటితే..పిల్లి మీకు దూరంగా ఉంటుంది.
  • కిటికీ, తలుపు దగ్గర రోజ్మేరీ మొక్కను ఉంచడం వల్ల పిల్లులు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ మొక్క పిల్లులకు కూడా విషపూరితమైనది.
  • పిల్లులను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి..ఇంటి చుట్టూ నిమ్మ గడ్డిని నాటవచ్చు. దీనిలో వచ్చే వాసన పిల్లి తట్టుకోదు.
  • జాడే మొక్కకు కూడా పిల్లులు దూరంగా ఉంటాయి. ఎందుకంటే.. వాటి ఆకులను తింటే పిల్లులు అనారోగ్యానికి గురవుతాయి.
Visitors Are Also Reading