ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాణక్యుడి విధానాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక విషయాలను పేర్కొన్నారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అయితే మనుషుల్లో ఒకరికి మరొకరు భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అలాగే వ్యక్తుల నిద్ర గురించి కూడా చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపారు. ఐదు రకాల వ్యక్తులను నిద్రలేపకూడదని చాణక్యుడు తెలిపారు. అలాంటివారు నిద్రకు భంగం కలిగిస్తే ఇబ్బంది పడతారని ఒక్కో సందర్భంలో జీవితానికి హాని కలుగవచ్చని చెప్పారు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. చిన్నపిల్లలను నిద్ర మధ్యలో అసలు లేపకూడదు. పిల్లలు అసంపూర్ణమైన నిద్రలో లేపితే చిరాకు పడుతారు. దీంతో వారు రచ్చ రచ్చ చేస్తారట. వారిని ఆపడం చాలా కష్టతరమవుతుంది. అందుకే పిల్లలను నిద్ర మధ్యలో అసలు లేపకూడదు. అది వారి ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతుంది.
Advertisement
Advertisement
పురాతన కాలంలో రాజు నిద్ర లేపడం పెద్ద సాహసమే. అంతేకాదు.. నేరంగా కూడా పరిగణించే వారు. ఇక ప్రస్తుత కాలంలో వస్తే పై అధికారిని పాలకుడు నిద్ర లేపితే వారి కోపానికి గురికావడం తప్పదు.
నిద్ర పోతున్న సింహాన్ని లేపడం అంత ప్రమాదకరం మరోటి ఉండదు. ఇలాంటి తప్పులు ఎవ్వరూ చేయవద్దు. నిద్ర వస్తున్న సింహాన్ని లేపితే అది మిమ్మల్ని భక్షిస్తుంది. ప్రాణాలే పోతాయి.
ఆచార్య చాణక్య చెప్పిన ప్రకారం.. మూర్ఖుడిని నిద్ర లేపడం అంటే ఇబ్బందులకు ఆహ్వానించడం, మూర్ఖుడు ఎవరి మాట వినడు. అలాంటి వారిని నిద్రలేపితే హాని తలపెట్టే ప్రమాదముంది.
ప్రమాదకరమైన మదమెక్కిన జంతువు నిద్రిస్తున్నప్పుడు మేల్కొలపడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఇది కోపంతో దాడి చేస్తే ప్రాణాలే పోతాయి. అపరిచిత కుక్కను నిద్ర లేపడం కూడా ప్రమాదమే.
Also Read :
Vidura Niti : జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడింటిని వదిలేయండి..!
99 ఏళ్ల బామ్మ.. తన 100వ మునిమనవడిని కలిసిన సంతోషంలో..!