Home »  భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?

 భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆస్తుల విషయంలో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక కుటుంబంలో ఇంటి యజమాని భర్త చనిపోతే ఆయనకు ఉన్న ఆస్తి ఏ విధంగా భార్యకు చెందుతుందో ఓ సారి చూద్దాం..? భర్త చనిపోయినప్పుడు కానీ, భర్త బ్రతికి ఉన్నప్పుడు కానీ లేదంటే భర్త  విడాకులు ఇచ్చినప్పుడు గాని భర్త ఆస్తిలో భార్యకు ఏమైనా వాటా ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఆ వాటా ఎలా వస్తుంది, ఎంత వస్తుంది..? భర్త ఆస్తిలో భార్యకు ఏమైనా హక్కులు ఉంటాయా..? ఇలాంటి విషయాలను అన్నీ చూసేది హిందూ సక్సెషన్ యాక్ట్.. దీని ప్రకారం తన భర్త బతికున్నంత వరకు భార్యకు ఎలాంటి హక్కులు ఉండవు.

Advertisement

ఇవన్నీ నేచర్ ప్రాపర్టీపై ఆధారపడి ఉంటాయి. నేచర్ అఫ్ ప్రాపర్టీస్ అంటే ఇందులో సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి, పిత్రార్జితం, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అంటారు. ఈ మూడింటిలో భర్త తరఫున ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో భార్యకు ఎలాంటి వాటా ఉండదు. ఇందులో సెల్ఫ్ అక్వయిడ్ ప్రాపర్టీ లో కూడా తన ఇష్ట పూర్వకంగా వీలునామా రాసి చనిపోతే తప్ప మిగతా ఎలాంటి హక్కులు భార్యకు ఉండవు. ఈ విధంగా వారసత్వ ఆస్తుల్లో భర్త బ్రతికి ఉన్నంత వరకు భార్యకు ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ భర్త చనిపోతే తనకు ఉన్నటువంటి వారసత్వ ఆస్తిలో భార్యకు మరియు పిల్లలకు సమానమైన ఆస్తి వస్తుంది.

Advertisement

కానీ భార్యకు ఎక్కువ ప్రాపర్టీ మాత్రం రాదు. ఒకవేళ భర్త తన సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తిలో మాత్రం ఆయన వీలునామా రాస్తే ఎవరి పేరు మీద వీలునామా రాస్తారో వారికి మాత్రమే ఆస్తి అంతా చెందుతుంది. మిగతా వారికి ఎలాంటి హక్కు ఉండదు. ఒకవేళ భార్యకు వీలునామా రాస్తే పిల్లలకు కూడా ఎలాంటి హక్కు ఉండదు అంతా ఆయన భార్య కి వెళ్ళిపోతుంది. తను ఇష్టపూర్వకంగా వీలునామా అనేది ఎవరికైనా రాసుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి వీలునామా రాయకపోతే ఆయన కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్న సమానమైన హక్కు ఆస్తిలో ఉంటుంది.

also read;

సీతారామం టీజ‌ర్ వ‌చ్చేసింది

అప్పుడు నాకు సెన్స్ జ్ఞానం లేవు..నాగబాబు ఎమోష‌న‌ల్..!

 

 

Visitors Are Also Reading