సాధారణంగా వాహనాల విషయంలో అటు పోలీసులకు, ఇటు వాహనదారునికి పెద్ద సమస్య అనే చెప్పవచ్చు. వాహనదారులు కొన్ని సందర్భాల్లో నెంబర్ ప్లేట్ మార్చడం, నెంబర్ ప్లేట్ లేకుండా చేయడం, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన తాత్కాలిక నెంబర్‌తో వాహనాలపై తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘించడం వంటి వాటిపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ ఇక నుంచి పూర్తిగా కనిపించాల్సిందేనట. ఒకవేళ నెంబర్ ప్లేట్ కనిపించకపోతే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తప్పవు అంటున్నారు.
తాజాగా ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ లో దాదాపు 150కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. వాహనం ఎవరి పేరుపై ఉంటుందో వారే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిబంధనలతో లింక్ అయి ఉన్న ఈ ఉల్లంఘనను పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరూ ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుండగా.. మరికొందరూ నేరాలు చేసేందుకు వాహనాల యొక్క నెంబర్ ప్లేట్ తీసేయడం ట్యాంపరింగ్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వాహనాల నెంబర్ ప్లేట్ సక్రమంగా ఉన్నవారు మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వారు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరనే ధీమాతో ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు.
Advertisement
Advertisement
వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం, ఒక వాహనం యొక్క నెంబర్‌ను మరో వాహనానికి వేయడం వంటి ఉల్లంఘటనకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. షోరూం నుంచి వాహనం కొనుగోలు చేసి తాత్కాలిక నెంబర్‌తోనే బయటకి తీసుకొస్తారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే జరిమానాతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని చాలా మంది తాత్కాలిక నెంబర్ ప్లేట్‌తోనే తిరుగుతున్నారు. మరికొందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ నెంబర్ ప్లేట్ వాహనానికి వేసుకోకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వారు ఎవ్వరైనా పట్టుబడితే మాత్రం కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన వారిపై చార్జీషీట్ వేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కోర్టుకు హాజరై తీర్పు మేప్లేర్లకు వాహనదారుడు నడుచుకోవాలి. వాహనదారులు ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించండి లేకుంటే మీకు జైలు శిక్ష తప్పదు.
Also Read :
ఊరగాయ పచ్చళ్లను ఎక్కువగా తినకూడదా..? తింటే ఏమవుతుందంటే..?
హీరో నాగార్జున- లక్ష్మీ విడిపోవడానికి అసలు కారణం ఇదేనట.. అప్పటి నుంచే గొడవలా..?