Home » వేప మొద‌ళ్లు త‌డిపితే మ‌ళ్లీ చిగుళ్లు

వేప మొద‌ళ్లు త‌డిపితే మ‌ళ్లీ చిగుళ్లు

by Anji
Ad

తెగుళ్ల‌తో ఎండిపోతున్న వేప చెట్టు తిరిగి చిగురిస్తాయని ఆచార్య జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం అధ్య‌య‌నంలో తేలింది. ప‌రుగులు, తెగుళ్లు సోకి దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది వేప‌చెట్లు రెండేళ్లుగా ఎండిపోతున్నాయి. ఆకులు ఎండి ఎర్ర‌బారి రాలిపోతున్నాయి. వీటిపై ఈ వ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అధ్య‌య‌నం చేస్తున్నారు. ర‌సాయ‌న మందుల పిచికారితో ప‌లు ప్రాంతాల్లో తెగుళ్ల‌ను నియంత్రిస్తున్నారు. ఎండిపోయిన చెట్ల మొద‌ళ్ల‌లో పుష్క‌లంగా నీరుపోస్తే చిగుళ్లు వ‌స్తున్న‌ట్టు జ‌య‌శంక‌ర్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌న సంచాల‌కుడు డాక్ట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి లభ్య‌త ఉన్న చోట నీరు అందించిన‌ట్ట‌యితే అవి చ‌నిపోకుండా నివారించ‌వ‌చ్చు అని సూచించారు.


పురుగుపై జ‌యశంక‌ర్ యూనివ‌ర్సిటీ అధ్య‌య‌నం

Advertisement

  • అసిటామిప్రిడ్ ర‌సాయ‌న మార్కెట్‌లో ప్రైడ్ అనే పేరుతో విక్ర‌యిస్తారు. ఈ మందును లీట‌ర్ నీటిలో 0.2 గ్రాముల చొప్పున క‌లిపి ఎండిన వేప‌చెట్ల‌పై డ్రోన్ల‌తో చ‌ల్లి జ‌య‌శంక‌ర్ వ‌ర్సిటీ ప్ర‌యోగం చేసింది.

 

  • స్ప్రింట్ పేరుతో అమ్ముతున్న ర‌సాయ‌న మందును 2.5 గ్రాముల‌ను లీట‌ర్ నీటిలో క‌లిపి వేప‌చెట్టుపై, మొద‌లులో చ‌ల్లాల‌ని వ‌ర్సిటీ పురుగు మందుల విభాగం ప్ర‌ధాన శాస్త్రవేత్త సూచించారు.

Advertisement

Also Read :  IPL 2022 : జ‌ట్టు పేరు, కెప్టెన్‌ను ప్ర‌క‌టించిన అహ్మ‌దాబాద్‌

  • ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ స‌మీప ప్రాంతాల అడ‌వుల నుంచి మొద‌లై టీ మ‌స్కిటో బ‌గ్ పొమోప్పిస్ శిలీంద్రం ఏడాదికాలంగా దేశమంతా విస్మ‌రించిన‌ట్టు ప‌లు వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల అధ్య‌య‌నాల్లో గుర్తించారు.

 

  • తేయాకు తోట‌ల్లో విరివిగా సంచ‌రించే దోమ సృష్టించిన క‌ల్లోలం అంతా ఇంతా కాదు. గ‌తంలో ఈ పురుగు జీడిమామిడి తోట‌ల‌ను పాడు చేసింది. పూత స‌మ‌యంలో కాడ‌ల‌పై ర‌సం పీల్చ‌డంతో దిగుబ‌డి లేక రైతులు, న‌ష్ట‌పోయారు. ఈ పురుగు వేప‌చెట్ల‌పై వ్యాపించ‌డాన్ని ఇటీవ‌లే గుర్తించారు.

  • గ‌త ఏడాది జులై నుంచి వాతావ‌ర‌ణంలో మార్పులు, అదిక వ‌ర్షాల కార‌ణంగా ముఖ్యంగా తెలంగాణ మ‌హ‌రాష్ట్రలో పురుగు స్వైర విహారం చేసి ల‌క్ష‌లాది వేప‌చెట్ల‌ను నాశ‌నం చేసింది. ముందు ఈ పురుగు వే చెట్టు త‌ల‌భాగంలో లేలేత కొమ్మ‌ల‌పై రంద్రాలు చేస్తుంది. దాని నుంచి స్ర‌వించే ద్ర‌వ‌ప‌దార్థాల‌పై గాలిలో ఉండే వివిధ ర‌కాల శిలీంద్రాన్ని పెంపొందించి చెట్టు కొమ్మ‌ల‌ను ఎండిపోయేలా చేస్తాను. వెంట‌నే ఆకులు రాలిపోతాయి. క్ర‌మంగా చెట్టు చ‌చ్చిపోతుంది. నీటి సౌక‌ర్యం లేని ప్రాంతాల్లో ఈ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశివారి ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది

Visitors Are Also Reading