Home » అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

by Anji
Ad

పెళ్లి అంటేనే నూరేళ్ల పంట‌. పెళ్లి అన‌గానే పెద్ద పండుగ వాతావ‌ర‌ణం నెలకొని ఉంటుంది. పెళ్లి జ‌రిగే సంద‌డి మామూలుగా ఉండ‌దు. పెళ్లి జ‌రుగుతుందంటే వ‌ధూవ‌రుల త‌రుపు నుంచి బంధువులు, స్నేహితులు వ‌స్తారు. ఎప్పుడూ ర‌క‌ర‌కాల ప‌నుల‌లో ప‌డి బిజీగా గ‌డిపే వారంద‌రూ పెళ్లిలో క‌లుస్తుంటారు. పాత ఫ్రెండ్స్ అంతా ఒక్క చోటుకు చేరి ఏరా మామా ఎలా ఉన్నావ్ అని ప‌లుక‌రించుకుంటారు. ఇక‌ నెక్ట్స్ పెళ్లి ఎవ‌రిదని.. కూడా చ‌ర్చించుకుంటారు. అవ‌న్ని స్వీట్ మెమొరీస్.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో డాన్స్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. సాధార‌ణంగా వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తుంటారు. లేని యెడ‌ల వ‌రుడు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి స్టెప్స్ వేస్తుంటాడు. అలాంటిది ఓ పెళ్లిలో మాత్రం వ‌ధువు చెల్లి చేసిన డాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

పాట‌కు త‌గిన విధంగా చ‌క్క‌ని కో ఆర్డినేష‌న్ స‌రైన ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చిన ఈ అమ్మాయి ఎవ‌ర‌ని నెటిజ‌న్లు సెర్చ్ చేస్తున్నారు. ఆమె పేరు సునాక్షి గ్రోవ‌ర్. మోడ‌లింగ్‌, యాడ్స్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు 1.53 ల‌క్ష‌ల మందికి పైగా నెటిజ‌న్లు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె పెర్పార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. వెరీ నైస్ అని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా.. వెరీ వండ‌ర్ పుల్ అని మ‌రొక యూజ‌ర్ కామెంట్ చేసారు. ల‌వ్లీ పెర్పార్మెన్స్ అని మ‌రొక యూజ‌ర్ అద్భుతం అని స్పందించారు.

ఇక ఫైర్ అని ఐద‌వ యూజ‌ర్ కామెంట్ ఇచ్చే వ‌ర‌కు.. వీరిని చూసి చాలా మంది నెటిజ‌న్లు ఫ‌న్నీ, ఫైర్‌, ల‌వ్లీ, హార్ట్ సింబ‌ల్ ఇమేజీల‌ను పోస్ట్ చేస్తున్నారు. సాధార‌ణంగా మోడ‌ల్స్ త‌మ బ్రాండ్ పెంచుకోవ‌డానికి సోష‌ల్ మీడియాపై ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. సునాక్షి కూడా అదే చేస్తుంది. రెగ్యుల‌ర్‌గా త‌న అప్‌డేట్ ఇస్తూ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ను పెంచుకుంటుంది. దీని ద్వారా మోడ‌లింగ్ అవ‌కాశాల‌ను వెతుక్కుటుంది. ఆవిధంగా త‌న కెరీర్‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటుంది.

 

Also Read : 

దేశంలో మొద‌టి గ్రీన్ ట్రాఫిక్ జంక్ష‌న్ హైద‌రాబాద్‌లోనే..!

Visitors Are Also Reading