అలనాటి నటి శ్రీదేవి రెండు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేశారు. ఆమె తన నటనా చాతుర్యం, అందచందాలతో అతిలోక సుందరిగా పేరు సంపాదించుకున్నారు.. ఆమెకు ఇంతటి క్రేజ్ రావడానికి ముందే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టి, తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాప్ హీరోయిన్ గా ఎదిగి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్,బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక శ్రీదేవి వైవాహిక జీవితం మరియు వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదని చెప్పవచ్చు.
Advertisement
ఆమెకు కూడా ఎన్నో అఫైర్లు అంటగట్టారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న బోనీకపూర్ ను రెండో వివాహం చేసుకోవడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే శ్రీదేవి కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొందరు హీరోలతో పెళ్లి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ముందుగా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి ప్రతిపాదన చేసిందట. కానీ రాజశేఖర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. దీని కంటే ముందే నటుడు చంద్రమోహన్ తో కూడా శ్రీదేవితో పెళ్లి చర్చలు జరిగాయని సమాచారం. అలాగే జేడీ చక్రవర్తిని కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని శ్రీ దేవి తల్లి చేతులు పట్టుకొని మరీ వేడుకున్నట్లుగా తెలుస్తోంది.
Advertisement
ఈ విధంగా అనేక మంది స్టార్ హీరోలతో శ్రీదేవి పెళ్లి ప్రతిపాదనలు వచ్చినా వారందరినీ కాదనుకొని బాలీవుడ్ స్టార్ హీరో గా ఉన్నటువంటి మిథున్ చక్రవర్తి తో లవ్ లో పడింది. అప్పటికే మిథున్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మిథున్ తో కలిసి శ్రీదేవి అనేక సినిమాల్లో నటించి సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో మిథున్ తన భార్య యోగితా కు విడాకులు ఇస్తే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని శ్రీదేవి తల్లి చెప్పిందట. కాని యోగితా మిథున్ లైఫ్ లోకి వచ్చాక ఆయన జీవితం మారిపోయిందని, శ్రీదేవి కోసం నా అదృష్ట దేవతను వదులుకోనని మిథున్ చెప్పారట. శ్రీదేవిని రెండో భార్యగా ఉంచుకోవడానికి మాత్రమే ఓకే చెప్పారట.. ఈ విధంగా శ్రీదేవి తల్లికి ఇష్టం లేకపోవడంతో మిథున్,శ్రీదేవి ల వివాహం జరగలేదు. అలా ఈ స్టార్ హీరో తో బ్రేకప్ అయ్యాక శ్రీదేవి మళ్ళీ బోనీ కపూర్ మాయలో పడింది.
ALSO READ;