సాధారణంగా పండుగల సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదలవ్వడం సర్వసాధారణం. వచ్చే ఏడాదికి టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య నటించిన సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు విడుదలవుతున్నాయి. వీటికి పోటీగా తమిళ సినిమాలు విజయ్ దళపతి నటించిన వరిసు, అజిత్ నటించిన తునివు కూడా సంక్రాంతి బరిలోనే వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ నటించిన సినిమా ఓవర్సిస్ మార్కెట్ లో రూ.35కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వరిసు చిత్రానికి నిర్మాత కావడంతో భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Advertisement
తాజాగా సంక్రాంతి పండుగ సమయంలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది. దీంతో తమిళనాడులో కూడా లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదం నెలకొంది. తాజాగా నామ్ తమిళర్ కట్చి అధినేత, దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాకుండా ఆపితే తమిళనాడులో తెలుగు సినిమాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Also Read : ఒకప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు అద్దె ఇంట్లో.. కాంతారావు కొడుకు భావోద్వేగం..!
ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కాంతారా వంటి డబ్బింగ్ సినిమాలు తమిళంలో కూడా మంచి విజయం సాధించాయని గుర్తు చేసారు. అంతేకాదు.. తమిళనాడు ఈ సినిమాల విడుదలకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ సినిమాల విడుదలకు మాత్రం ఎందుకు తెలుగు నిర్మాతలు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు సీమాన్. తెలుగు నిర్మాతల మండలి వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేని పక్షంలో తెలుగు సినిమాల విడుదలను తమిళనాడులో విడుదల కాకుండా అడ్డుకుంటామన్నారు. విజయ్ నటించిన వరిసు తెలుగులో విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి మరి.
Also Read : 2022 అత్యధికంగా వసూలు చేసిన టాప్ 10 భారతీయ సినిమాలు ఇవే..!