బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా నటించారు. భారీ అంచనాలు, విమర్శల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.240 కోట్లు వసూలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన నేటితరం రామాయణాన్ని తెరపై చూపించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Advertisement
మరోవైపు దర్శకుడి పై విమర్శలు సైతం కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ రివ్యూలు.. అదేవిధంగా పోస్టులను తొలగించేందుకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిపురుష్ మూవీపై ప్రారంభం నుంచే విమర్శలు వస్తున్నాయి. సినిమా విడుదలైన తరువాత దర్శకుడు ఓంరౌత్ పై మండిపడుతున్నారు కొందరూ ప్రేక్షకులు. సినిమాలో వేషాధారణ, కథను నడిపించిన తీరు, చూపించిన విధానం అంతగా లేవనే విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
Advertisement
ముఖ్యంగా ఆదిపురుష్ మూవీ గురించి నెగిటివ్ రివ్యూలు, పోస్టులు చేసిన వారికి డబ్బులు చేస్తున్నారట. అందుకు సంబంధించి మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అవికూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ నెగిటివ్ రివ్యూలను డిలీట్ చేసి పాజిటివ్ రివ్యూ పోస్ట్ చేసినందుకు రూ.9,500 చెల్లించారని ఒకరు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. మరొకరు నెగిటివ్ ట్వీట్ ని డిలీట్ చేసిందుకు గాను ఆ ట్వీట్ కి రూ.5,500 ఆఫర్ చేశారు. స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి మూవీ టీమ్ సభ్యులు ఇలా ఆఫర్ చేస్తున్నారా లేదా ఇంకెవ్వరు అయినా ఇలా చేస్తున్నారా అనేది మాత్రం తెలియదు. మరోవైపు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ డిలీట్ చేసి పాజిటివ్ పోస్టులు చేస్తే డబ్బులు ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో ఈ విమర్శలు చాలా ఎక్కువయ్యాయి. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Rakesh Master : ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి