Home » యువ క్రికెట‌ర్ య‌ష్ ధుల్‌ను ప్ర‌త్యేకంగా గౌర‌వించిన ఐసీసీ

యువ క్రికెట‌ర్ య‌ష్ ధుల్‌ను ప్ర‌త్యేకంగా గౌర‌వించిన ఐసీసీ

by Anji

కొడుకు కోసం తండ్రి ఉద్యోగం వ‌దులుకున్నాడు. టీం ఇండియాలో చోటుకోసం పెద్ద ప్ర‌య‌త్న‌మే చేశాడు.క‌ఠోర శ్ర‌మ చేశాడు. చివ‌రికి సాధించాడు ఆ కుర్రాడు. పేరు ర‌షీద్ .. పూర్తి పేరు షేక్ ర‌షీద్.. వాళ్ల నాన్న పేరు షేక్ వలీషా అలీ.ఇవాళ ఆ కుర్రాడు వాళ్ల నాన్న క‌ల తీర్చాడు. దేశానికి గ‌ర్వ కార‌ణం అయి నిలిచి ఆంధ్రోడి స‌త్తా చాటాడు.

ఇంట‌ర్ చ‌దువుతున్న ర‌షీద్ ఎవ‌రో తెలుసా..మ‌న తెలుగోడు..మ‌న గుంటూరోడు.మిర్చి లాంటి కుర్రోడు. టీం ఇండియాను గెలిపించి నోడు.టీం ఇండియా అండ‌ర్ 19 క్రికెట్ టీం కు వైఎస్ కెప్టెన్.నిన్నటి వేళ టీం ఇండియా గెలుపున‌కు కీల‌కం అయ్యాడు. సెమీస్ లోనూ ఫైన‌ల్స్ లోనూ రాణించాడు. సెమీస్ లో 94 ప‌రుగులు చేసి సెంచ‌రీ చేజార్చుకున్నా ఆత్మ నిబ్బ‌రం కోల్పోడు. పైన‌ల్స్ లో ఆఫ్ సెంచ‌రీ చేసి జ‌ట్టు విజ‌యానికి మ‌ళ్లీ దోహ‌దం అయ్యాడు. మ‌న కుర్రాడు ఇవాళ దేశం అంతా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లే కావాలి ఈ దేశానికి.. దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపేవాళ్లు కావాలి.దేశానికి విజేత‌లు కావాలి. ర‌షీద్ లాంటి కుర్రాళ్లే కావాలి.


అండర్‌-19 టీమిండియా కెప్టెన్‌ యష్ ధుల్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్‌ ఇంగ్లండ్‌ను ప్రపంచకప్ ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌లుగా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్‌-19 ప్రపంచకప్‌ 2022లో విన్నింగ్‌ కెప్టెన్‌గా నిలిచిన యష్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

అండర్‌-19 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఐసీసీ మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యష్ ధుల్‌ కెప్టెన్‌గా ఈ టోర్నీలో పాల్గొన్న 8 దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్ స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి యష్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓశ్వాల్‌కు చోటు దక్కింది

Visitors Are Also Reading