ప్రపంచకప్ నిర్వహించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏమైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందా? ఇప్పుడు చాలాచోట్ల ఇదే చర్చ నడుస్తోంది. ఆ చర్చకు కారణం పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ చేసిన ఈ ట్వీటే కారణం. మొన్న శ్రీలంక మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఈ ట్వీట్ చేశాడు. తన సెంచరీని గాజాలో ఉన్న సోదరీ సోదరీమణులకు అంకితం ఇస్తున్నట్టు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం గాజాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. అందువల్ల ఇతను చేసిన ట్వీట్ కాస్త పొలిటికల్ గా కనెక్ట్ అయి ఉన్న ట్వీట్.
దీంతో ఈ ట్వీట్ ని కాస్త ఇండియన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దానికి ధోని 2019లో ప్రపంచకప్ ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు. ఆ టోర్నీలో సౌత్ ఆఫ్రికాతో మ్యాచులో ధోని వాడిన వికెట్ కీపింగ్ గ్లౌజ్ పై వివాదం నడిచింది. దానికి కారణం ధోని గ్లౌజ్ పై పారా మిలటరీ సింబల్ ఉండడమే. దీన్ని ఐసిసి తప్పుపట్టింది. గ్లౌజు మీద మ్యానుఫ్యాక్చరర్ లోగో తప్ప వేరే ఏదీ ఉండకూడదని, రాజకీయ లేదా రేషియో లోగోలు ఉండకూడదని తర్వాత మ్యాచ్ కు బ్యాన్ చేయాలని తేల్చిచెప్పింది. ధోని తర్వాత మ్యాచ్ కు ఈ లోగో లేని గ్లౌజులు వేసుకొని మైదానంలోకి దిగాడు.
Advertisement
Advertisement
మరి ఇప్పుడు రిజ్వాన్ కూడా పొలిటికల్ గా సంబంధం ఉన్న ట్వీట్ చేశాడు కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడే చిన్న మెలిక ఉంది. ధోని మ్యాచ్ సమయంలో ఆ గ్లౌజ్ వేసుకున్నాడు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. కానీ రిజ్వాన్ చేసిన ట్వీట్ మ్యాచ్ సమయంలో కాదు. అంటే క్రికెట్ ఫీల్డ్ బయట చేసిన చర్య కాబట్టి ఐసీసీ దీన్ని లెక్కచేయదు. అది ప్లేయర్ మరియు ఆ క్రికెట్ బోర్డు నిర్ణయం అన్నమాట.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : వరల్డ్ కప్ నుంచి గిల్ అవుట్..ధావన్ కు పిలుపు ?
- 16 ఏళ్లకే చనిపోతావని తెలిస్తే అలా చేసి ఉండేదాన్ని కాదు!.. మీరా మృతిపై విజయ్ భార్య ఎమోషనల్
- అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?