ఐబొమ్మ గురించి సినీ అభిమానులకు ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు కొత్త సినిమా వచ్చిన చాలా మంది ఐబొమ్మకి ఎప్పుడు వస్తుందో అప్పుడే చూస్తామంటుంటారు. కొంత మంది థియేటర్‌కి వెళ్లి చూస్తుంటారు. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఐబొమ్మకి క్రేజ్ మామూలుగా లేదు. కరోనా సమయంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యేవి. అప్పుడు ఓటీటీలో విడుదలైన సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండానే హై క్వాలిటీతో ఉచితంగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది ఐబొమ్మ. తాజాగా ఐబొమ్మ సినీ అభిమానులకు షాక్ ఇచ్చింది.
Advertisement
సెప్టెంబర్ 09 నుంచి భారత్ లో తమ సర్వీస్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు.. భవిష్యత్‌లో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని.. తమకు ఎవ్వరూ మెయిల్స్ చేయకూడదని యూజర్స్ సైతం కోరడం విశేషం. ఇప్పటివరకు తమపై చూపించిన ప్రేమకు అభినందనలు చెప్పారు ఐ బొమ్మ నిర్వాహకులు. ముఖ్యంగా హెచ్‌డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో మంది సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ.
Advertisement
ఇది కూడా చదవండి : అల్లు అరవింద్ సతీమణి కండీషన్ మామూలుగా లేదుగా.. అది ఒప్పుకున్నందుకే బన్నితో స్నేహా పెళ్లి జరిగిందా..?
భారత్‌లో ఐబొమ్మ వెబ్‌సైట్ ని ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకున్న ఐబొమ్మ గతంలో కూడా తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట సినిమా డౌన్‌లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించడంతో యూజర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో అనేది మాత్రం తెలియాలంటే సెప్టెంబర్ 09 వరకు ఎదురుచూడాల్సిందే..!
ఇది కూడా చదవండి : మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!