టీడీపీ నాయకుడు, భీమవరం మాజీ శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు తాజాగా జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించాడు రామాంజనేయులు. 2019లో భీమవరంలో ఓడియారు. ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయించారు.
Advertisement
జనసేన తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పులపర్తి అంజిబాబు.. వచ్చేది టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. తనను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన భీమవరం టికెట్ తనకు ఇచ్చినట్టు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. భీమవరం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భీమవరం తన సొంత నియోజకవర్గం అని చెప్పారు. వదలబోనని, గుండెల్లో పెట్టుకుంటానిన చెప్పారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ భీమవరంలో జనసేన అభ్యర్థే పోటీ చేస్తాడని తేల్చి చెప్పారు. భారీ మెజార్టీతో అక్కడ గెలుస్తామనే ధీమాను పవన్ కళ్యాన్ తెలిపారు.
Advertisement
2019 ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోవడం పై స్పందించారు పవన్ కళ్యాణ్. అలాంటి ఓటమి తనకు ఇష్టం లేదని.. ఓడిపోతానని తెలిసి ఉంటే నేరుగా వైఎస్ జగన్ పై పోటీకి దిగి ఉండేవాడినని పేర్కొన్నారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పై కంటే పులివెందులలో జగన్ పై పోటీ చేసి ఒడిపోవడం తనకు ఇష్టం అని వ్యాఖ్యానించారు. ఈ అలయన్స్ రాష్ట్ర, దేశ రాజకీయాలకు మార్చి వేస్తుందిన.. ఒ కొత్త శకానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : CAAను సమర్ధించిన పాకిస్తానీ క్రికెటర్.. వారంతా ఊపిరి పీల్చుకుంటారంటూ ట్వీట్..