Home » అతనితో డేటింగ్ వల్లే.. బరువు తగ్గిన రాశి ఖన్నా !

అతనితో డేటింగ్ వల్లే.. బరువు తగ్గిన రాశి ఖన్నా !

by Bunty
Ad

 

అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అమాయకత్వం, నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గా రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు పెద్దగా హిట్ కాలేకపోయాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ వైపుకు వెళ్ళింది.

Advertisement

పలు వెబ్ సిరీస్, సినిమాలలో నటిస్తూ రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తితో లవ్ బ్రేకప్ వల్లే తను డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పుకొచ్చింది. డిప్రెషన్ వల్లే చాలా బరువు పెరిగానని, అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా లేదని వెల్లడించింది. తనకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడంతో ఎంత వర్కౌట్ చేసినప్పటికీ బరువు తగ్గలేదని చెప్పుకొచ్చింది. బరువుగా ఉండడం వల్లే సినిమాల్లో తనకు పెద్దగా ఆఫర్స్ రాలేదని వెల్లడించింది. ఇక అదే సమయంలో ఒక వ్యక్తి తనకు పరిచయమయ్యాడని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, అతని వల్లే డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక ఆ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని… అతనితో డేటింగ్ వల్లే చాలా సన్నబడ్డారని చెప్పుకొచ్చింది. తనని బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడని…ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అతనితో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే నేను చాలా బరువు తగ్గానని, ఇప్పుడు నేను అనుకున్న విధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాశి ఖన్నా తాను ఎవరిని ప్రేమిస్తున్నాననే విషయం ప్రకటించలేదు.

 

 

Visitors Are Also Reading