Home » సుహాసినితో అలాంటి సంబంధం నాది.. ఆ సీక్రెట్ చెప్పిన బాలకృష్ణ

సుహాసినితో అలాంటి సంబంధం నాది.. ఆ సీక్రెట్ చెప్పిన బాలకృష్ణ

by Anji

నందమూరి బాలకృష్ణ, నటి సుహాసిని మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రాముడు భీముడు, మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా సుహాసిని, బాలకృష్ణ నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించింది. అయితే తాజాగా బాలకృష్ణ హోస్టుగా చేసే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ లుగా వచ్చారు. సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరంజీలు.

వీరందరిలో ముందుగా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగానే.. నాకు సుహాసినికి మధ్య విడదీయరాని బంధం ఉంది అంటూ బాలకృష్ణ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. మా ఇద్దరిదీ జన్మజన్మల బంధం అలాగే శ్రియా తో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక సుహాసిని బాలకృష్ణ గురించి చెబుతూ బాలకృష్ణ అప్పట్లో చాలా సిగ్గుపడుతూ ఉండేవారు అని చెప్పగా.. శ్రీయ గట్టిగా అరిచింది. వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పేది నేను అసలు నమ్మను అని చెప్పగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను మీ ముగ్గురితో మాత్రమే మాట్లాడతాను. హరీష్ శంకర్ ని పక్కన పెడతాను అని అన్నారు.

 


ఆయన మాటలకు అవాక్కైన జయంత్ సి పరాంజి ఎందుకు పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడగగా.. నాకు హరీష్ శంకర్ తో పాత గొడవలు ఉన్నాయిలే అని చెప్పారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సుహాసిని, శ్రియాలతో బాలకృష్ణ బంధం గురించి తెలియాలంటే అలాగే హరీష్ శంకర్ కి బాలకృష్ణకి మధ్య ఉన్న పాత కక్ష్యల గురించి పూర్తి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ ఎపిసోడ్ మొత్తం వీక్షించాల్సిందే.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading