Home » చంద్రబాబు కేసుకు సంబంధించి ఆధారాల గురించి నాకు తెలియదు.. లాయర్ పొన్నవోలు సుధాకర్ కామెంట్స్ వైరల్..!

చంద్రబాబు కేసుకు సంబంధించి ఆధారాల గురించి నాకు తెలియదు.. లాయర్ పొన్నవోలు సుధాకర్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి ఓవైపు సుప్రీంకోర్టు, ఏపీ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కేసు విషయంలో సీఐడీ తరపున వాదించే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.  వాటిని ఇప్పుడు మనం చూద్దాం.

Advertisement

 చంద్రబాబు కేసులో ఈ డెసిసన్స్ 2015లో తీసుకోలేదు. ఈకేసుకు ఎట్టి పరిస్థితిల్లో 17 (ఏ) అప్లై కాదు.. మేము ప్రతీ వద్ద తమ వాదనల గురించి చెబుతున్నాం. ఏసీబీ కోర్టులో మా వాళ్లు చెప్పారు. హై కోర్టులో చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా చెప్పారని వెల్లడించారు. ఎంక్వైరీ 05/06/2018 లో రైడింగ్ జరిగిందని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ అనే పదం.. 17 (ఏ) లో వాడారు. ఎంక్వైరీ ఇవ్వడానికి లేదు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయిందనే ప్రస్తావన లేదు. అక్కడ ఉండే ప్రస్తావన మాత్రం ఒక్కటే.. ఎంక్వైరీ ఎప్పుడు వేశారు..? ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు. 26/07/2018న ఆర్డర్ చేసి ఉండాలి. ఎఫ్ఐఆర్ అనే పదం లేదు అక్కడ..? ఎంక్వైరీ వేయడానికి లేదు.  26/07/2018 తరువాత తీసుకున్న డెసిసన్ ఇది. ఆ రోజు నుంచి డెసిషన్ పై కేసు వేయాలంటే.. ఆధారాలు లేవు.. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆధారాలు ఉంటే ఛార్జీ షీట్ వస్తుంది.

Chandrababu has two ways to escap from scam

Advertisement

ఆధారాలు సేకరించాలని ఇద్దరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. పి.శ్రీనివాస్ అనే వ్యక్తి, పార్థసారధి. ఇచ్చిన తెల్లారి ఒక ఆయన దుబాయ్, ఒకాయన అమెరికా పారిపోయారు. వారిద్దరూ ఈ కేసులో ప్రథమమైన సాక్షులు. మేము ఈరోజు నోటీసులిచ్చాం. మళ్లీ తెల్లారిసరికే ఇద్దరూ కనిపించకుండా పారిపోయారు. రిమాండ్ రిపోర్టులో ప్రాథమిక ఆధారాలు లేకుంటే రిమాండ్ అయ్యే ప్రశ్నే లేదు. ఒక రిమాండ్ చేయడం అంటే.. ఇంచు మించుగా దాని ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తారు. ఇది ట్రయల్ కాదు.. ట్రయల్ అనేది చార్జీషీట్ తరువాత జరుగుతుందని పొన్నవోలు తెలిపారు. రిమాండ్ అప్పుడు ఒక నేరారోపణ చేసినప్పుడు ఆ నేరారోపణకి అరెస్ట్ చేసిన తరువాత ఈ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు ఆ రిమాండ్ రిపోర్టులో ప్రాథమిక ఆరోపణలు చూపించాలి. అయితే మళ్లీ హైకోర్టుకు వచ్చారు. ప్రాథమిక ఆధారాలు లేనిది హైకోర్టు కూడా తీసుకోదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. 482కి ఉండే లక్షణం.. కేసు పూర్తి షేప్ తీసుకోరి… ఛార్జీ షీట్ వేసే వరకు.. ముద్దాయిని చేసిన రెండో రోజు, మూడో రోజు క్వాష్ పిటిషన్ వేశారు. ప్రస్తుతానికి వారి వద్ద ఏ ఆధారం ఉంది.. ఏ రికార్డు ఉంది అనేది తనకు తెలియదు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆగడానికి కారణం ఏంటో తెలుసా ?

 హీరోయిన్ పూజా హెగ్దేను అలా చేశారా..?

Visitors Are Also Reading