జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్ అంటే ఏ రేంజ్ కిక్ ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాటల తూటాలతో రెచ్చిపోయే ఆయన ప్రతీ పదంలో జబర్దస్త్ పంచ్ ఉండేవిదంగా చూసుకుంటాడు. మనోడి రొమాంటిక్ యాంగిల్స్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. లేడీ కమెడీయన్స్‌తో ఆయన వేసే స్కిట్స్.. పేల్చే డైలాగ్‌లు అబ్బో.. మాటల్లో వర్ణించలేము. జబర్దస్త్‌లో అనసూయతో మనోడు పేల్చే పంచ్‌లు ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తుంటాయి. జనవరి 20న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల అయింది. ఇందులో హైపర్ ఆది పుష్ప గెటప్‌లో అదరగొట్టాడు.
Advertisement
Advertisement
పుష్పరాజ్ గెటప్ వేసి అనసూయను ఉద్దేశిస్తూ.. హైపర్ ఆది చేసిన కామెంట్లు ఇప్పుడు వైరలవుతున్నాయి. జబర్దస్త్ ఎపిసోడ్లో ప్రోమో పుష్ప సినిమాలోని క్యారెక్టర్లను రీ క్రియేట్ చేసాడు ఆది. పుష్పరాజ్‌గా ఎంట్రీ ఇచ్చి.. రావడం రావడమే అనసూయపై కన్నేసాడు. తగ్గేదేలేఅంటూనే నాకు అనసూయ ఐ లవ్ యూ చెప్పిందనేశాడు. దీంతో ఆమె తెగ సిగ్గుపడిపోయింది. దాక్షాయణి పాత్రలో ఉన్న శాంతి మాదిరిగా అనసూయ ఉన్నదనే సరికి ఆమె కోపపడుతూనే నవ్వేసింది. జనవరి 20న ఇందుకు సంబంధించిన పుల్ ఎపిసోడ్ ప్రసారం కానున్నది.
ఇప్పటికే ఆన్ స్క్రీన్ పై చాలా సార్లు రొమాంటిక్ స్టెప్పులేసి బుల్లితెర ఆడియన్స్‌కు కిక్కు ఇచ్చింది అనసూయ-హైపర్ ఆది జోడి. మొత్తానికి ప్రోమోలో ఈ జంట మరొకసారి కార్యక్రమంపై హైప్ తెచ్చారు. ఇక మిగతా ఆర్టిస్టుల స్కిట్స్ కూడా పేలిపోయాయి. వీరు తెగ సందడి చేయనున్నారు అని ప్రోమోని చూస్తుంటే అర్థం అవుతుంది. మొత్తానికి ప్రేక్షకులకు ఏ పాయింట్ కావాలో దానినే మెయిన్‌గా టార్గెట్ చేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.