రీసెంట్ గా సివిల్స్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. సివిల్స్ లో ర్యాంక్ కొట్డడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి చదవాల్సి ఉంటుంది. అలా ఎంతో కష్టపడి చదివి ర్యాంకు కొట్టిన వాళ్ల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అంతే కాకుండా సివిల్స్ విజేతలను ఎవరిని కదిలించినా ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంటుంది.
Advertisement
అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సివిల్స్ ర్యాంకర్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కు చెందిన ముస్తాఫా హాష్మి చిన్న తనంలోనే డాక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. తన ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన తరవాత ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించాడు. అంతే కాకుండా ఉస్మానియాలోనే ఎంఎస్ చదువుకున్నాడు. ఆ తరవాత ప్రభుత్వ దవఖానాలో సర్జన్ గా సేవలు అందించాడు.
Advertisement
కానీ అతడిలో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదల అలానే ఉండిపోయింది. 2012 లో ముస్తాఫా హాష్మి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసిన ప్రముఖ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో పాల్గొన్నాడు. ఈ షోలో విజేతగా నిలిచాడు. చకచకా జవాబులు చెప్పి ముస్తాఫా అందర్నీ ఆశ్యర్యపరిచాడు. ఉస్మానియా ఆస్పత్రిలో ట్రెయినింగ్ చేస్తున్న సమయంలోనే తనకు సివిల్స్ సాధించాలని కోరిక కలిగినట్టు తెలిపాడు.
ALSO READ :బ్రహ్మం గారి కాలజ్ఞానం మరో సారి నిజమైందా ? నేపాల్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా ?
ఆస్ప్రతికి వచ్చే వారికి కేవలం అనారోగ్యమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని చెప్పాడు. అంతే కాకుండా వెనకబాటు తనం ఇలా చాలా ఇబ్బందులు ఎదురుకుంటారని అలాంటి పేద ప్రజలకు సేవ చేసేందుకే తాను సివిల్స్ కోసం చదివానని చెప్పారు.ఇక ముస్తాఫా జీవితం నేడు ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తోంది.