Home » అలాంటి దుస్తులు ధరించకండి…మహిళలకు తెలంగాణ పోలీస్ కీలక సూచన..!

అలాంటి దుస్తులు ధరించకండి…మహిళలకు తెలంగాణ పోలీస్ కీలక సూచన..!

by AJAY
Published: Last Updated on

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వాళ్లు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదాలు తప్పవు. వెనక కూర్చున్న వాళ్ళు ఎందుకు ప్రమాదం బారిన పడతారు అని డౌట్ రావచ్చు. వెనకాల కూర్చున్న మహిళలు అప్రమత్తంగా లేకపోవడం వల్ల జాగ్రత్త లు తీసుకోకపోవడం వల్ల కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్ లోని నాచారం కు చెందిన సన అనే డిగ్రీ విద్యార్థిని తన సోదరుడి బైక్ పై వెళుతూ కిందపడి మరణించింది. ఆమె అలా పడిపోవడానికి కారణం ఆమె ధరించిన బర్కా నే. బర్కా బైక్ వెనక చక్రాలలో చిక్కుకు పోవడం వల్ల ఆమె ఒక్కసారిగా కింద పడింది. తలకు బలమైన గాయాలు తగలటం తో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి మహిళలను హెచ్చరించారు. బైక్ పై వెలుతున్నప్పుడు వెనకాల కూర్చొనిఉన్న వాళ్ళు లూజ్ డ్రెస్సులను ధరించకూడదు అని చెప్పారు. అంతే కాకుండా బూర్కా ధరించడం కూడా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. అదే విధంగా చున్నీ లు, చీర కట్టుకుంటే కొంగు విషయం లో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Visitors Are Also Reading