Home » అఖండ‌పై హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్ర‌శంస‌లు..ఎందుకో తెలుసా..?

అఖండ‌పై హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్ర‌శంస‌లు..ఎందుకో తెలుసా..?

by AJAY
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ‌. ఈ సినిమా ఇప్ప‌టికే 50 రోజులు పూర్తి చేసుకుని 200 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. రీసెంట్ గా ఓటీటీలో విడుద‌ల‌వ్వ‌గా అక్క‌డ కూడా బాల‌య్య హవా కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ సినిమాల్లోని డ్రైవింగ్ సీన్ల‌పై సెటైర్లు వేసే హైద‌రాబాద్ పోలీసులు తాజాగా బాల‌య్య అఖండ సినిమాపై మాత్రం పాజిటివ్ ట్వీట్ వేశారు.

Advertisement

హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు త‌ర‌చూ సినిమాల్లోని సీన్ల పై హెల్మెంట్ ధ‌రించ‌లేద‌ని..సీటు బెల్ట్ పెట్టుకోలేద‌ని సెటైర్లు వేస్తూ మీమ్స్ వేస్తుంటారు.అయితే బాల‌య్య ప్ర‌గ్యా జైశ్వాల్ జంట‌గా న‌టించిన అఖండ సినిమాలో ఓ స‌న్నివేశంలో బాల‌య్య‌, ప్ర‌గ్యా జైశ్వాల్ జీపులో వెళుతుండగా ఇద్ద‌రూ కూడా సీటు బెల్టును ధ‌రించి కనిపిస్తున్నారు.

Advertisement

Balayya

Balayya akhanda movie review

దాంతో ఈ సీన్ స్క్రీన్ షాట్ ను ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీటు బెల్టు ధ‌రించినందుకు చిత్ర యూనిట్ కు థాంక్స్ చెప్పారు. త‌న ట్వీట్ లో ఎంత దూర‌మైనా ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఎవ‌రైనా ప్రయాణించ‌వ‌చ్చు. కానీ సీటు బెల్టు త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోండి. థాంక్యూ బాల‌కృష్ణ గారు, బోయ‌పాటి శ్రీను గారు ట్రాఫిక్ రూల్స్ ను ప్ర‌మోట్ చేస్తున్నందుకు అంటూ పేర్కొన్నారు.

Visitors Are Also Reading