Telugu News » Blog » హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ చేంజ్…?

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ చేంజ్…?

by Venkatesh
Ads

హైదరాబాద్ మెట్రో రైళ్లను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అభినవ్ అనే ప్రయాణికుడు చేసిన ట్వీట్ కు మంత్రి కేటిఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు చేరుకుంటున్నారని…. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభం కానుండడంతో సుమారు గంట పాటు వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు వేచి చూసే వీడియోను ఆయన ట్వీట్ చేసారు.

Advertisement

Advertisement

ఉదయం సమయంలో క్యాబ్స్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని విజ్ఞప్తి చేయగా దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్…ఉదయం 6 గంటల నుంచే మెట్రో ను అందుబాటులోకి తీసుకోచ్చే అంశాన్ని పరిశీలించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. నగరంలో మెట్రో రైల్లు మొదటి స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి… చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్న సంగతి తెలిసిందే.

Advertisement