వాహనాల చలాన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజల వాహనాలకు చలాన్లు పెండింగ్ లో ఉంటే పోలీసులు ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగ్ లో ఉంటే కనీసం సగమైన చెల్లించనిదే వాహనాన్ని రోడ్డుపైనే అడ్డంగా నిలిపివేస్తారు. అదే తప్పు ఉన్నతాధికారులు చేస్తే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం రివాజుగా మారుతుంది.
READ ALSO : Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!
Advertisement
ఇది ఇలా ఉండగా, తాజాగా ‘సేఫ్ కేరళ’ ప్రాజెక్టులో భాగంగా కేరళ రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల ఫోటోలు భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసాయి. ఏప్రిల్ 25న ఇడుక్కికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాళ్లతో కలిసి స్కూటర్ పై ప్రయాణించారు. అయితే అతడు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ కెమెరాల ఫోటోల ద్వారా అధికారులు గుర్తించి ఎవరి పేరు మీద బైక్ రిజిస్టర్ అయిందో వారి మొబైల్ ఫోన్కు చలానా మెసేజ్ వెళ్ళింది.
Advertisement
READ ALSO : వెంకటేష్ భార్య నీరజ ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఆమె సీక్రెట్స్ ఇవే?
ఆ స్కూటర్ భార్య పేరు మీద రిజిస్టర్ అయింది. అందుకని ఆమె మొబైల్ ఫోన్కు మెసేజ్ వెళ్ళింది. దీంతో ఎవరిని ఎక్కించుకోని వెళ్ళావో చెప్పాలని భార్య నిలదీసింది. ఆ మహిళతో తనకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం లిఫ్ట్ ఇచ్చానని చెప్పిన భార్య నమ్మలేదు. భార్య భర్తల మధ్య కొన్నాళ్లపాటు గొడవ నడిచింది. ఈ నేపథ్యంలో తనను, తన పిల్లలను కొడుతున్నాడని భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ఈనెల ఐదున అనేక సెక్షన్ల పై భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు.
READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్ ?