Home » 2వ ప్రపంచ యుద్ధ టైంలో పెళ్లి పత్రిక ఎలా ఉందంటే..ఆ 3 పదాల అర్థమేంటబ్బా..!!

2వ ప్రపంచ యుద్ధ టైంలో పెళ్లి పత్రిక ఎలా ఉందంటే..ఆ 3 పదాల అర్థమేంటబ్బా..!!

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో పెళ్లి పత్రికలు అనేది రకరకాల డిజైన్లలో ఎవరికి నచ్చినట్టు వారు ముద్రించుకుంటున్నారు.. కొంతమంది ఫోటోలతో మరికొంతమంది డిజైన్లతో తయారు చేసుకుంటున్నారు. పత్రిక ఎలా తయారు చేసినా కానీ అందులో మాత్రం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అనే పదాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక పెళ్లి పత్రికలో ఈ మూడు పదాలకు బదులు మరో మూడు పదాలు ముద్రించారు.

Advertisement

also read:అర్ధరాత్రి 12:ఎన్టీఆర్+ జయలలిత..అమ్మ బాబోయ్ అంత పని చేశారా..?

అవేంటో మీరు చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. 9 మే 1946 లో ప్రచురించిన ఈ పత్రికలో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అనేది ఉండాల్సిన చోట శాంతి స్వాతంత్ర్యం అభ్యుదయం అనే పదాలు ఉన్నాయి. ఆహ్వాన పత్రిక మొదటి లైన్ లో వందేమాతరం అనే జాతీయ ఉద్యమ నినాదం చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయ పౌరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందులో మరొక పాయింట్ ఏంటంటే ఆహ్వాన పత్రిక చివర్లో దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపాలని వ్రాసి ఉంది.

Advertisement

ఈ లైను మనం చూస్తూ ఉంటే ఆ టైంలో వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ,ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. తాడంకి గ్రామంలో జరిగిన ఈ వివాహం లో ఈ విధమైన పెళ్లి పత్రికను ముద్రించి తమ బంధుమిత్రులను ఆహ్వానించారు. ఈ పత్రికపై కనకమేడల సుబ్బయ్య తన సోదరుడు పెళ్లికి పిలుస్తున్నట్లు ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పెళ్లి పత్రిక బయటకు రావడంతో ఆ యుద్ధ సమయంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేది అని మన కళ్ళకు కట్టినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పత్రిక బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:ఈ ఒక్క కారణం వల్లే చిరంజీవి కృష్ణలను పక్కనబెట్టి.. మోహన్ బాబుతో సినిమా చేశారా..బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?

Visitors Are Also Reading